కోర్టులో మీకు సంబంధించిన కేసు ఏదైనా పెండింగ్‌లో ఉందా.. అయితే వెంటనే ఇందులో పరిష్కరించుకోండి..

పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అప్పుడప్పుడు లోక్ అదాలత్‌లను

కోర్టులో మీకు సంబంధించిన కేసు ఏదైనా పెండింగ్‌లో ఉందా.. అయితే వెంటనే ఇందులో పరిష్కరించుకోండి..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 12:11 AM

పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అప్పుడప్పుడు లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా డిసెంబర్ 12న లోక్ అదాలత్ నిర్వహించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 31 రాష్ట్ర న్యాయాధికార సంస్థలు 8152 ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేశాయి. వీటిలో కొన్ని వర్చువల్‌గా నిర్వహించగా, మరికొన్ని ఆయా కోర్టు పరిధిలోనే ఏర్పాటు చేశారు.

కాగా ఈ లోక్ అదాలత్‌ల వల్ల 10 లక్షల కేసులు పరిష్కరామైనట్లు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. మొత్తం 10,42,816 కేసులు పరిష్కారం కాగా వీటిలో 5,60,310 కేసులు వాజ్యానికి ముందు దశలోనే పరిష్కారమైనట్లు వెల్లడించింది. అలాగే వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 4,82,506 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారమైనట్లు వివరించింది. పరిష్కారమైన కేసుల్లో చాలా రకాల కేసులు ఉన్నాయి. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, పారిశ్రామిక గొడవలు, బ్యాంకింగ్ సమస్యలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, సివిల్ కేసులు, బీమా పరిష్కరాలు ఇలా చాలా రకాల కేసులకు పరిష్కారం దొరికింది. అయితే ఇలా పరిష్కారమైన వివాదాలకు లీగల్ అథారిటీ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం చట్టబద్దత ఉంటుంది. దీంతో దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా తగ్గుముఖం పడతాయి. ఏళ్లనాటి కేసులకు కూడా పరిష్కారం లభిస్తుంది.