AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బిగుస్తున్న ఉచ్చు..జర్నలిస్ట్‌ను బెదిరించిన కేసులో హైకోర్టులో పిల్

ఎమ్మెల్యే  జర్నలిస్ట్‌ను బెదిరించిన కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనలో మహిపాల్‌రెడ్డిపై అట్రాసిటి కేసు నమోదైంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని..

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బిగుస్తున్న ఉచ్చు..జర్నలిస్ట్‌ను బెదిరించిన కేసులో హైకోర్టులో పిల్
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 18, 2020 | 12:15 AM

Share

ఎమ్మెల్యే  జర్నలిస్ట్‌ను బెదిరించిన కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనలో మహిపాల్‌రెడ్డిపై అట్రాసిటి కేసు నమోదైంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేయాలని రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసుపై న్యాయస్థానం శుక్రవారం విచారించనుంది.

జర్నలిస్టును ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ దినపత్రికకు చెందిన జర్నలిస్టు సంతోష్‌నాయక్‌ను ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈమేరకు అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us