తెలంగాణలో క‌రోనా వీర‌విహారం..ఒక్క‌రోజే ఆరుగురు మృతి

తెలంగాణలో క‌రోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటెన్ లో వెల్లడించింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 41 కేసులు న‌మోదుకాగా.. రంగారెడ్డిలో 5, సంగారెడ్డి జిల్లాలో 3, మహబూబ్‌నగర్‌, జగిత్యాలో 2 చొప్పున కేసులు చొప్పున గుర్తించారు. వరంగల్ అర్బన్‌, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వివ‌రించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్దార‌ణ […]

తెలంగాణలో క‌రోనా వీర‌విహారం..ఒక్క‌రోజే ఆరుగురు మృతి
Ram Naramaneni

|

May 30, 2020 | 10:29 PM

తెలంగాణలో క‌రోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటెన్ లో వెల్లడించింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 41 కేసులు న‌మోదుకాగా.. రంగారెడ్డిలో 5, సంగారెడ్డి జిల్లాలో 3, మహబూబ్‌నగర్‌, జగిత్యాలో 2 చొప్పున కేసులు చొప్పున గుర్తించారు. వరంగల్ అర్బన్‌, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వివ‌రించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్దార‌ణ అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 2,499కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9 మంది వలస కూలీలు, మరో ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారికి క‌రోనా సోకిన‌ట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఇవాళ మరో ఆరుగురు ప్రాణాలు విడువ‌గా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 77కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,412 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా..ప్ర‌స్తుతం 1,010 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసూ రికార్డ‌వ్వ‌ని మూడు జిల్లాల్లో ఒకటైన వనపర్తిలో ఇవాళ ఫ‌స్ట్ కేసు నమోదు అయింది. మరో 14 జిల్లాల్లో… గత 14 రోజులుగా ఒక్క కోవిడ్-119 కేసూ నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణ‌లో ఇప్పటివరకు మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్ బారినపడిన స్థానికుల సంఖ్య 2,068గా నమోదుకాగా.. 431 మంది వలస కూలీలు, విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu