తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు…ఏకంగా…

తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు...ఏకంగా...

తెలంగాణలో ఇప్ప‌టివ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా పాజిటివ్ కేసులు నేడు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్ మాత్ర‌మే కేసులు నమోదవుతూ ఉండంటంతో అంద‌రూ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ, ఈ రోజు ఏకంగా 31 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1163కు చేరుకుంది. నేడు వ్యాధి న‌య‌మై కొత్తగా 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య‌ 382గా ఉంది. ఇప్పటి […]

Ram Naramaneni

|

May 09, 2020 | 9:32 PM

తెలంగాణలో ఇప్ప‌టివ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా పాజిటివ్ కేసులు నేడు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్ మాత్ర‌మే కేసులు నమోదవుతూ ఉండంటంతో అంద‌రూ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ, ఈ రోజు ఏకంగా 31 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1163కు చేరుకుంది. నేడు వ్యాధి న‌య‌మై కొత్తగా 24 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య‌ 382గా ఉంది. ఇప్పటి వరకు 751 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ రోజు క‌రోనాతో రాష్ట్రంలో ఒకరు చనిపోయారు. దీంతో కోవిడ్ కార‌ణంగా ప్రాణాలు విడిచినవారి సంఖ్య 30 కి పెరిగింది. ఈ రోజు నమోదైన 31 కేసుల్లో కూడా 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోవే కావ‌డం గ‌మ‌నార్హం. ఒక కేసు మాత్రం వలస కార్మికుల నుంచి వచ్చింది. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో అసలు కరోనా కేసే న‌మోదు కాలేదు. గత 14 రోజులుగా 23 జిల్లాల్లో కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం నేటి బులెటెన్ లో వెల్ల‌డించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu