నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దూరం..ఎందుకంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో… ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. అయితే త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో…పలువురు ప్రముఖులను ఆహ్వనించాల్సి […]

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దూరం..ఎందుకంటే?
Ram Naramaneni

|

Jun 14, 2019 | 3:49 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో… ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. అయితే త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో…పలువురు ప్రముఖులను ఆహ్వనించాల్సి ఉండటం, రాష్ట్రంలోని పలు శాఖలపై కీలకమైన సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నందునే కేసీఆర్ నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్లడం లేదని సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu