తెలంగాణ భవన్ ఉద్యోగికి కరోనా పాజిటివ్..!

ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా సోకింది. దీంతో కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు.తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న వారికి కరోనా సోకిన విషయం నిర్ధారణ కావడంతో

తెలంగాణ భవన్ ఉద్యోగికి కరోనా పాజిటివ్..!
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 6:02 PM

ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా సోకింది. దీంతో కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు.తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న వారికి కరోనా సోకిన విషయం నిర్ధారణ కావడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు…తెలంగాణ భవన్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత.. అతని కుటుంబంలోనే మరో ఇద్దరికీ కరోనా వచ్చినట్లు నిర్దారణ చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు.

లక్షణాలు లేని అతని కుటుంబ సభ్యులకు ఇద్దరిని హోమ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో…ఒక్క సారిగా అప్రమత్తం అయిన అధికారులు తెలంగాణ భవన్ ను శానిటేషన్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ ప్రారంభం అయినప్పటి నుంచి… ఆఫీస్ లలో యాభైశాతం సిబ్బందితో మాత్రమే పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ భవన్లో, ఉద్యోగుల క్వార్టర్స్ లో ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మీడియా, ఇతర కొత్త వ్యక్తులకు, మిగితా వారికి ఎవరికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసారు.

ఒక్క సారిగా కరోనా రావడంతో.. ప్రైమరీ కాంటాక్ట్ లను పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కి కాంటాక్ట్ లో ఉన్న వాళ్లందరికీ హోమ్ క్వారంటైన్ అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే అన్ని రకాల చర్యలు,ఏర్పాట్లు చేస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మిగతా వాళ్ళందరిని ఇంటి వద్దే ఉండాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది మే మాసంలో ఢిల్లీలో పనిచేస్తున్న ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు కరోనా సోకడం తో మీడియా మిత్రులకు కూడా తెలంగాణ భవన్ లోకి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ జర్నలిస్టులకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గతం లోనే ఆదేశాలు జారీ చేశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?