ఇవాళ్టి నుంచి ఇంటికే బతుకమ్మ చీరలు

బతుకమ్మ పండుగ పురస్కరించుకుని ప్రతిఏటా ఆడుపడుచులకు తెలంగాణ ప్రభుత్వం కానుక అందిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి అందించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది.

ఇవాళ్టి నుంచి ఇంటికే బతుకమ్మ చీరలు
Follow us

|

Updated on: Oct 09, 2020 | 7:41 AM

బతుకమ్మ పండుగ పురస్కరించుకుని ప్రతిఏటా ఆడుపడుచులకు తెలంగాణ ప్రభుత్వం కానుక అందిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి అందించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారుచేసిన కోటి చీరలను ఇప్పటికే అయా జిల్లాలకు చేరుకున్నాయి. వీటి కోసం రూ.317 కోట్లను ప్రభుత్వం వెచ్చింది. తెల్లకార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అవసరమైన చోట భౌతిక దూరం పాటిస్తూ చీరల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బతుకమ్మ చీరల పంపిణీ కోసం గత నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.1,033 కోట్లు ఖర్చు చేసింది. చీరలు అందనివారు రేషన్ షాపుల ద్వారా కూడా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సర్కిళ్ల వారిగా అయా కమ్యూనిటీ హళ్ల వద్ద చీరల పంపిణీ ఉంటుందన్నారు.