సీఏఏను వెనక్కి తీసుకోవాలి: కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా, పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు కేసీఆర్. సీఏఏ తప్పుడు నిర్ణయమని కేసీఆర్ తెలిపారు. ముస్లింలను ఎలా పక్కన పెడతారని అయన ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుకు సపోర్ట్ చేశామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా త్వరలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని […]
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా, పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు కేసీఆర్.
సీఏఏ తప్పుడు నిర్ణయమని కేసీఆర్ తెలిపారు. ముస్లింలను ఎలా పక్కన పెడతారని అయన ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుకు సపోర్ట్ చేశామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా త్వరలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన వివరించారు. సీఏఏకు వ్యతిరేకంగా పది లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అరాచకం, విచ్చలవిడి తనాన్ని ఉపేక్షించబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎవరు ఏమనుకున్నా భయపడేది లేదన్నారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని స్పష్టం చేశారు.