మెగాస్టార్​ కుమార్తె నిర్మాణంలో ‘షూట్​ అవుట్​ ఎట్​ అలైర్’​ , ఆకట్టుకుంటోన్న టీజర్

మెగాస్టార్​ కుమార్తె నిర్మాణంలో 'షూట్​ అవుట్​ ఎట్​ అలైర్'​ , ఆకట్టుకుంటోన్న టీజర్

ప్రముఖ డిజైనర్​, మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మాణంలో ఓ వెబ్​సిరీస్​ రూపొందింది. 'ఓయ్​' ఫేమ్​ ఆనంద్​ రంగ దర్శకత్వం వహించిన...

Ram Naramaneni

|

Nov 14, 2020 | 8:49 PM

ప్రముఖ డిజైనర్​, మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మాణంలో ఓ వెబ్​సిరీస్​ రూపొందింది. ‘ఓయ్​’ ఫేమ్​ ఆనంద్​ రంగ దర్శకత్వం వహించిన ఈ సిరీస్​కు ‘షూట్​ అవుట్​ ఎట్​ అలైర్​’ అనే పేరుతో ప్రేక్షకులను పలుకరించబోతుంది. దీపావళి సందర్భంగా దీనికి సంబంధించిన విడుదలైన టీజర్​.. థ్రిల్లింగ్​ అంశాలతో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

కొన్నేళ్ల క్రితం అలైర్​లో జరిగిన ఓ ఎన్​కౌంటర్​కు సంబంధించి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్​సిరీస్​ను తెరకెక్కించారు. ‘షూట్​ అవుట్​ ఎట్​ అలైర్’​ వెబ్​సిరీస్​లో శ్రీకాంత్​, ప్రకాశ్​ రాజ్​, నందనీ రాయ్​తో పాటు తదితరులు నటించారు. ఈ సిరీస్​ను క్రిస్​మస్​ కానుకగా డిసెంబరు 5న జీ5 ఓటీటీ యాప్​లో రిలీజ్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా డైరెక్టర్ రమణ తేజ తెరకెక్కించబోతున్న సినిమా టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు `కిన్నెరసాని` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని తాజాగా ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

 

Also Read :

ఏపీలో విద్యార్థుల కోసం ప్రత్యేక వెబ్​సైట్.. ఆశయాల వైపు పయనించేలా వినూత్న ఆలోచన

సీటీమార్ రీ స్టార్ట్ : రెడీ అంటోన్న టీమ్..బరిలోకి గోపిచంద్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu