బాబుకు రాజకీయ బ్రోకర్లే అవసరమా..?: వరదరాజుల రెడ్డి
ఏపీ టీడీపీలో ముసలం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా.. ఇప్పుడు టీడీపీలోని సీనియర్ నేతలందరూ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో గురువారం నలుగురు రాజ్యసభ ఎంపీలు కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫైర్ అవుతూనే.. చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ బ్రోకర్లను పక్కన పెట్టుకోవడంతోనే పార్టీ దారుణంగా ఓడిపోయిందని అన్నారు. సొంత లాభం కోసమే కొందరు […]

ఏపీ టీడీపీలో ముసలం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా.. ఇప్పుడు టీడీపీలోని సీనియర్ నేతలందరూ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో గురువారం నలుగురు రాజ్యసభ ఎంపీలు కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫైర్ అవుతూనే.. చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ బ్రోకర్లను పక్కన పెట్టుకోవడంతోనే పార్టీ దారుణంగా ఓడిపోయిందని అన్నారు.
సొంత లాభం కోసమే కొందరు పార్టీ మారుతున్నారని వరదరాజులు రెడ్డి విమర్శించారు. సీఎం రమేష్ ఓ పొలిటికల్ బ్రోకర్.. తన ప్రయోజనాల కోసమే అతడు పార్టీ మారాడని మండిపడ్డారు. కడప జిల్లాలో టీడీపీ దారుణ ఓటమికి సీఎం రమేష్‌నే కారణమని వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు.



