స్థానిక సంస్థల ఎన్నికల్లో.. టీడీపీతో సీపీఐ పొత్తు..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపై చంద్రబాబు, రామకృష్ణ చర్చలు జరిపారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ పొత్తుపై స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా-సీపీఐ కలిసే పోటీ చేస్తాయని.. సీట్ల సర్దుబాటుపై రేపటిలోపు స్పష్టత వస్తుందని చెప్పారు.