శ్రీకాకుళం పొలిటికల్ హీట్: రంగంలోకి చంద్రబాబు, సర్దార్ గౌతు లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టులను ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య సమరయోధుడు...

శ్రీకాకుళం పొలిటికల్ హీట్: రంగంలోకి చంద్రబాబు,  సర్దార్ గౌతు లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 24, 2020 | 12:53 PM

శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టులను ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ మంత్రులు, నేతలను వదిలి, టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. శ్రీకాకుళంలో కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీషలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు అనిన చంద్రబాబు, పౌరుల హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామని మంత్రి సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న గారిని అవమానించిన వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.   లైవ్: ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోనూ షురూ చేశారు, టీడీపీ-వైసీపీ పోటాపోటీ హడావుడి, భారీగా హౌస్ అరెస్టులు

శ్రీకాకుళం జిల్లాలో పోటాపోటీ: మంత్రి అప్పలరాజు సెంట్రిక్‌గా.. గౌతులచ్చన్న విగ్రహం ముందు టీడీపీ ఆందోళన, వైసీపీ నేతల శుద్ధి కార్యక్రమం