Taurus Horoscope 2021: కెరీర్ పరంగా ఈ సంవత్సరం వృషభ రాశివారి ఫలితం.. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా ?

2021 సంవత్సరం శుక్రుడు పరిధిలోని వృషభ రాశి వారికి జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ సంవత్సరం పొడవునా శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో ఉండగ..

Taurus Horoscope 2021: కెరీర్ పరంగా ఈ సంవత్సరం వృషభ రాశివారి ఫలితం.. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా ?
Follow us

|

Updated on: Jan 08, 2021 | 6:14 PM

Taurus Horoscope 2021:  2021 సంవత్సరం శుక్రుడు పరిధిలోని వృషభ రాశి వారికి జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ సంవత్సరం పొడవునా శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో ఉండగ.. సంవత్సరం ప్రారంభంలో గురు, బృహస్పతి కూడా తొమ్మిదవ స్థానంలోనే శనితో కలిసి ఉంటాయి. దీంతో వీరి వైవాహిక జీవితం మరియు ఆర్థిక జీవితంపై ప్రభావం చూపిస్తుంది.

మొదటి మరియు ఏడవ స్థానాల్లో రాహు-కేతు ఉండడం వలన మీ ఆరోగ్యంపై కూడా కాస్తా ప్రభావం చూపిస్తుంది. ఈ సంవత్సరంలో మే 4 నుంచి మే 28 వరకు శుక్రుడి ప్రభావంతో ట్రావెల్ మరియు ఇతర రంగాల్లో విజయం సాధిస్తారు. ఇక వృషభం రాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కెరీర్ మరియు వ్యాపారం : వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్‌లో విజయాన్ని సాధిస్తారు. శని ప్రభావంతో ఏడాది పొడవునా సంతోషంగా గడుపుతారు. మీరు పనిచేసే కార్యాలయంలో విజయాలు అందుకుంటారు. కానీ వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వాములతో వ్యాపారం చేసేవారు బిజినెస్‏కు సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవాలి, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.

ఆర్థికంగా కుటుంబ జీవితం : ఈ కొత్త సంవత్సరం వృషభ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అంగారక గ్రహ ప్రభావంతో సంవత్సర ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థుతులు మెరుగుపరుడతాయి. ఈ ఏడాది కొత్త వాహనం లేదా ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితాన్ని అర్థం చేసుకునే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల ప్రభావంతో ఇంట్లో కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

సంసార జీవితం : శుక్రుడు మరియు గురు, బృహస్పతి ఈ రాశిలో ఉండడం వల్ల ప్రేమ విషయంలో సన్నిహితుల నుంచి సహయం పొందుతారు. దీంతో గతంలోని మనస్పర్థలు తొలగిపోతాయి. కేతు గ్రహాం కారణంగా వైవాహిక స్త్రీలు కొంతవరకు బాధపడతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

చదువు : ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ అనుకూలం ఉంటుంది. ఏడాది ప్రారంభంలో విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారం తరువాత వీరి పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ఉన్నత చదువులకు సిద్ధమయ్యే విద్యార్థులకు సానుకూల పరిస్థితులను పొందుతారు.

ఆరోగ్యం : వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. రాహు-కేతు ప్రభావంతో ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఆ సమయంలో ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, వేయించిన ఆహారానికి దూరంగా ఉండండి.

పరిష్కారం : పదేళ్ల లోపు వయసుగల అమ్మాయిలకు భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు అదృష్టం కలుగుతుంది.

మూలం : Tv9 భారత్ వర్ష్ (Tv9 Hindi)

Also Read: Aries Horoscope 2021: ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే.. ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉందా ?