పవన్‌ ‘పింక్‌’ కోసం ‘తాజ్ మహల్’ సెట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్‌కి దేవుడు. ఆయన సినిమా వస్తుందంటే.. అభిమానుల హంగామాకు హద్దే ఉండదు. అలాగే.. పవన్ కోసం ఏం చేసేందుకైనా నిర్మాతలు కూడా వెనకడుగేయరు. ఆ విధంగానే ఇప్పుడు ‘పింక్’ సినిమా కోసం తాజ్‌ మహల్ సెట్ వేస్తున్నారట. ఇప్పుడు ఈ వార్తనే వైరల్ అవుతోంది. సైలెంట్‌గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు పవన్. బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన ‘పింక్’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో పవన్ […]

పవన్‌ 'పింక్‌' కోసం 'తాజ్ మహల్' సెట్?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 30, 2020 | 12:12 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్‌కి దేవుడు. ఆయన సినిమా వస్తుందంటే.. అభిమానుల హంగామాకు హద్దే ఉండదు. అలాగే.. పవన్ కోసం ఏం చేసేందుకైనా నిర్మాతలు కూడా వెనకడుగేయరు. ఆ విధంగానే ఇప్పుడు ‘పింక్’ సినిమా కోసం తాజ్‌ మహల్ సెట్ వేస్తున్నారట. ఇప్పుడు ఈ వార్తనే వైరల్ అవుతోంది. సైలెంట్‌గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు పవన్. బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన ‘పింక్’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణీకపూర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కాగా.. ఇప్పుడు పింక్ రీమేక్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో తాజ్ మహల్, ఛార్మినార్ సెట్‌లను భారీ ఖర్చుతో సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. వీటిపై నిజమెంతో తెలీదు కానీ.. ఈ న్యూస్ కాస్తా వైరల్‌గా మారింది. నిజానికి.. పవన్ నటించిన ‘తొలిప్రేమ, బాలు’ సినిమాలకు తాజ్‌ మహల్, ఛార్మినార్ సెట్‌లను వేశారు. అలాగే.. ఒకరకంగా పవన్‌కి తాజ్ మహల్ సెట్ బాగా అచ్చొచ్చిందనే చెప్పాలి. ఆ సినిమాలన్నీ పెద్ద హిట్ కూడా అయ్యాయి. అందులోనూ సినిమా వాళ్లు సెంటిమెంట్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూంటారు. చూడాలి మరి పవన్ రీఎంట్రీలో ఏ మాత్రం సెంటిమెంట్ అచ్చొస్తుందో.