T20 World Cup 2024: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ ఆశలు.. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇలా జరగాల్సిందే!
మహిళల టీ20 ప్రపంచకప్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి. అంటే టీ20 ప్రపంచకప్ భవితవ్యం టీమిండియా భవితవ్యం నేడు పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో తేలిపోనుంది. గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 8 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా +0.322 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ +0.282 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.488తో నాలుగో స్థానంలో ఉంది.
ఇక్కడ, భారత్ (+0.322), న్యూజిలాండ్ (+0.282) సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది, అయితే ఆ జట్టేవరో పాకిస్తాన్ నిర్ణయిస్తుంది. అంటే న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఇక్కడ నిర్ణయాత్మకం. న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే.. నెట్ రన్ రేట్ సాయంతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలిస్తే 6 పాయింట్లతో సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుంది.ఒక వేళ న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ జట్టు కూడా సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
సెమీస్ లెక్కలిలా..
- న్యూజిలాండ్‌పై పాక్ గెలిస్తే భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
- పాకిస్థాన్‌పై గెలిస్తే న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
- న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసి 53 పరుగుల తేడాతో గెలిస్తే పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది .
- న్యూజిలాండ్ 9.1 ఓవర్లలో లక్ష్యాన్ని (150 పరుగులు) ఛేదిస్తే, పాకిస్థాన్ సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది.
అంటే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవ్వాలి. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు భారీ తేడాతో గెలవకూడదు. ఈ రెండు సందర్భాల్లోనే నెట్ రన్ రేట్‌లో భారత జట్టు రెండు జట్లను అధిగమించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.
A valiant knock from Captain Harmanpreet Kaur 👏👏#TeamIndia came close to the target but it’s Australia who win the match by 9 runs in Sharjah.
📸: ICC
Scorecard ▶️ https://t.co/Nbe57MXNuQ#T20WorldCup | #INDvAUS | #WomenInBlue pic.twitter.com/jBJJhjSzae
— BCCI Women (@BCCIWomen) October 13, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..