రాజస్థాన్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
రాజస్థాన్‌లో స్వైన్ ఫ్లూ కారణంగా శుక్రవారంనాడు మరో వ్యక్తి మృతిచెందాడు. దీంతో గత జనవరి నుంచి ఇప్పటి వరకూ స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 126కు పెరిగింది. కాగా నిన్న ఒక్క రోజే మొత్తం 74 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జనవరి 1నుంచి ఫిబ్రవరి 15 వరకూ 3359 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారితమైంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష బీజేపీ […]
రాజస్థాన్‌లో స్వైన్ ఫ్లూ కారణంగా శుక్రవారంనాడు మరో వ్యక్తి మృతిచెందాడు. దీంతో గత జనవరి నుంచి ఇప్పటి వరకూ స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 126కు పెరిగింది. కాగా నిన్న ఒక్క రోజే మొత్తం 74 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జనవరి 1నుంచి ఫిబ్రవరి 15 వరకూ 3359 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారితమైంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది.