AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింధూతో సైనా ఢీ

గువాహటి: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మరోసారి హోరాహోరీ పోరుకు వేదికైంది. శనివారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత టాప్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ టైటిల్‌ సమరానికి సై అంటున్నారు. గతేడాది కూడా వీళ్లిద్దరే ఫైనల్లో తలపడగా సైనా విజేతగా నిలిచింది. భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ సింధు 21-10, 22-20తో అస్మితను ఓడించింది. తొలి […]

సింధూతో సైనా ఢీ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:37 PM

Share

గువాహటి:

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మరోసారి హోరాహోరీ పోరుకు వేదికైంది. శనివారం మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత టాప్‌ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ టైటిల్‌ సమరానికి సై అంటున్నారు. గతేడాది కూడా వీళ్లిద్దరే ఫైనల్లో తలపడగా సైనా విజేతగా నిలిచింది.

భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ సింధు 21-10, 22-20తో అస్మితను ఓడించింది. తొలి గేమ్‌ను త్వరగానే కోల్పోయి అస్మిత.. రెండో గేమ్‌లో సింధుకి గట్టి పోటి ఇచ్చింది. అయితే చివరికి సింధు అనుభవమే గెలిచింది. మరో సెమీస్‌లో రెండో సీడ్‌ సైనా 21-15, 21-14తో క్వాలిఫయర్‌ వైష్ణవిని ఓడించింది. అంతకుముందు క్వార్టర్స్‌లో సైనా 21-10, 21-10తో నేహా పండిట్‌పై గెలిచింది.

‘‘సైనాతో ఫైనల్‌ మరో మ్యాచ్‌గానే భావిస్తున్నా. రాబోయే ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీకి ఈ మ్యాచ్‌ ఉపయోగపడుతుందని అనుకోవట్లేదు. పూర్తి స్థాయిలో రాణించి టైటిల్‌ గెలవడమే నా లక్ష్యం’’ అని సింధు చెప్పింది.

సైనా మూడు సార్లు (2006, 2007, 2018)జాతీయ టైటిల్‌ నెగ్గగా.. సింధు రెండు సార్లు (2011, 2013) సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో క్వాలిఫయర్లు లక్ష్యసేన్‌, సౌరభ్‌ వర్మ ఫైనల్లో ప్రవేశించారు. సెమీస్‌లో లక్ష్యసేన్‌ 21-15,  21-16తో మాజీ ఛాంపియన్‌, మూడో సీడ్‌ పారుపల్లి కశ్యప్‌కు షాకిచ్చాడు. మరో సెమీస్‌లో సౌరభ్‌వర్మ 21-14, 21-17తో కుశాల్‌పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన-పూర్వీషా రామ్‌ జోడీ ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో మేఘన-పూర్వీషా 21-19, 24-22తో అపర్ణా బాలన్‌-స్మృతిపై విజయం సాధించారు.

Follow Us