కేరళ జర్నలిస్ట్ అరెస్టు, యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు, హైకోర్టుకే వెళ్లాలని సూచన

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ అరెస్టును సవాల్ చేస్తూ, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఫై స్పందించిన సుప్రీంకోర్టు..

కేరళ జర్నలిస్ట్ అరెస్టు, యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు, హైకోర్టుకే వెళ్లాలని సూచన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 16, 2020 | 4:48 PM

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ అరెస్టును సవాల్ చేస్తూ, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఫై స్పందించిన సుప్రీంకోర్టు.. యూపీ ప్రభుత్వానికి నోటీసును జారీ చేసింది. హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఢిల్లీ నుంచి యూపీ బయల్దేరిన సిద్ధిక్ ను పోలీసులు గత అక్టోబరు 5 న అరెస్టు చేశారు. టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద అదుపులోకి తీసుకుని మధుర జైలుకు తరలించారు. అయితే ఈ అరెస్టు అక్రమమని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ కేరళ  వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సుప్రీంకోర్టుకెక్కింది. తమ సభ్యుడికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించింది. సిద్ధిక్ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తన క్లయింటుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే   ఆధ్వర్యాన గల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించి యూపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అయితే పిటిషనర్ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు