కమల్ నాథ్ పిటిషన్, ఈసీకి సుప్రీంకోర్టు చురకలు

కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కి స్టార్ క్యాంపెయినర్ హోదా తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ లిస్ట్ నుంచి ఒక అభ్యర్థిని తొలగించడానికి మీకు అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. మీరేనా ? లేక ఓ పార్టీ నాయకుడా ? అని సీజేఐ ఎస్. ఎ. బాబ్డే అన్నారు. ఒక పార్టీకి ఎవరు నేతగా ఉండాలనే పవర్ మీకు ఎక్కడినుంచి వచ్చిందని, స్టార్ క్యాంపెయినర్ అని ఎవరు నిర్ణయిస్తారని, మీరా లేక పార్టీయా […]

కమల్ నాథ్ పిటిషన్, ఈసీకి సుప్రీంకోర్టు చురకలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 02, 2020 | 3:47 PM

కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కి స్టార్ క్యాంపెయినర్ హోదా తొలగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ లిస్ట్ నుంచి ఒక అభ్యర్థిని తొలగించడానికి మీకు అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. మీరేనా ? లేక ఓ పార్టీ నాయకుడా ? అని సీజేఐ ఎస్. ఎ. బాబ్డే అన్నారు. ఒక పార్టీకి ఎవరు నేతగా ఉండాలనే పవర్ మీకు ఎక్కడినుంచి వచ్చిందని, స్టార్ క్యాంపెయినర్ అని ఎవరు నిర్ణయిస్తారని, మీరా లేక పార్టీయా అని కూడా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ వైఖరిపై అత్యున్నత న్యాయస్థానం ఇంత తీవ్రంగా స్పందించడం ఇదే మొదటిసారి.

బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యతో ఈసీ ఆయనకు స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ను తొలగిస్తూ గత నెల 30 న నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరు అతిక్రమించారని, మీది  గౌరవప్రదమైన ప్రవర్తన కాదని ఆ నోటీసులో పేర్కొంది. కానీ దీన్ని కమల్ నాథ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఒక వ్యక్తిని ఈ హోదాలో నియమించే అధికారం, హక్కు  పార్టీకి ఉంటాయని, ఈ నిర్ణయంలో మీరు జోక్యం చేసుకోజాలరని ఆయన తన పిటిషన్ లో అన్నారు.