ఉల్లి బస్తాలను ఎత్తుకెళ్లిన దొంగలు
దేశంలో ఉల్లి ధరలు ప్రస్తుతం మళ్ళీ ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి వంద రూపాయల వరకూ పలుకుతుంది. దీంతో ప్రతినిత్యం ఉల్లిని తప్పనిసరిగా వినియోగించే వారంతా... ఉల్లిని తరగకుండానే కన్నీరు పెట్టుకుంటున్నారు.

దేశంలో ఉల్లి ధరలు ప్రస్తుతం మళ్ళీ ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి వంద రూపాయల వరకూ పలుకుతుంది. దీంతో ప్రతినిత్యం ఉల్లిని తప్పనిసరిగా వినియోగించే వారంతా… ఉల్లిని తరగకుండానే కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉల్లి ధరలు అమాంతం పెరిగిన నేపధ్యంలో ఉల్లి బస్తాల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ని ఎరుంపట్టి సమీపంలో 20 బస్తాల ఉల్లిని చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నామక్కల్ జిల్లా ఎరుంపట్టి సమీపం ముట్టాంజెట్టి ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి తన రెండెకరాల పొలంలో ఉల్లి సాగుచేస్తున్నాడు. కోత కోసి 40 బస్తాల్లో ఉంచిన ఉల్లిని పొలంలోనే టార్పాలిన్ పట్టలు కప్పి నిల్వ చేశాడు. ఉదయం పొలానికి వెళ్లి పరిశీలించగా 20 బస్తాలు అదృశ్యం కావడం గుర్తించి ఎరుంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నదాత ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చోరీకి గురైన ఉల్లి బహిరంగ మార్కెట్‌లో రూ.75 వేలు విలువ ఉంటుందని బాధిత రైతు రామస్వామి పేర్కొన్నాడు.




