Olympic Games: సమ్మర్ ఒలింపిక్ పతకాలలో టాప్‌-10 దేశాలు ఇవే..! భారత్ ప్లేస్ చూస్తే.. పరేషాన్ అవ్వాల్సిందే!

ఇప్పటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మొత్తం 15,683 పతకాలు వివిధ దేశాలకు లభించాయి. ఇందులో 5,116 బంగారు పతకాలు, 5,080 రజత పతకాలు, 5,487 కాంస్య పతకాలు ఉన్నాయి.

Olympic Games: సమ్మర్ ఒలింపిక్ పతకాలలో టాప్‌-10 దేశాలు ఇవే..!  భారత్ ప్లేస్ చూస్తే.. పరేషాన్ అవ్వాల్సిందే!
Summer Olympics 2021
Follow us
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2021 | 6:41 PM

Olympic Games: ఆధునిక ఒలింపిక్స్ 1896వ సంవత్సరంలో ఏథెన్స్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ క్రీడల్లో కొన్ని దేశాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించి పతకాలను ఎగరేసుకుపోయాయి. అలాగే మరికొన్ని దేశాలు పతకాలు సాధించేందుకు చాలా కష్టపడ్డాయి. ఇప్పటివరకు సమ్మర్ ఒలింపిక్స్‌ చరిత్రలో మొత్తం 15,683 పతకాలను వివిధ దేశాలు గెలుపొందాయి. వీటిలో 5,116 బంగారు పతకాలు, 5,080 రజత పతకాలు, 5,487 కాంస్య పతకాలు ఉన్నాయి. సమ్మర్ ఒలింపిక్స్ పతకాల ఆధారంగా పలు దేశాలు సాధించిన ర్యాంకులు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్‌ఏ) సమ్మర్ ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించిన దేశాల్లో యూఎస్‌ఏ అథ్లెట్స్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. యూఎస్‌ఏ మొత్తం 2,523 పతకాలను గెలుచుకుని తన సత్తా చాటింది. ఇందులో 1,022 బంగారు పతకాలు కాగా, 795 రజతం, 706 కాంస్య పతకాలు ఉన్నాయి.

రష్యా మొత్తం 1556 పతకాలతో రష్యన్లు రెండో స్థానంలో నిలిచారు. ఇందులో 590 బంగారు పతకాలు, 486 రజత పతకాలు, 480 కాంస్య పతకాలను రష్యా దేశం సాధించింది.

జర్మనీ ఇక మూడో స్థానంలో జర్మనీ నిలిచింది. జర్మన్ అథ్లెట్స్‌ ఒలింపిక్ చరిత్రలో 428 బంగారు పతకాలు, 444 రజతాలు, 474 కాంస్యాలతో మొత్తం 1,346 పతకాలు సాధించారు.

గ్రేట్ బ్రిటన్ ఒలింపిక్స్‌లో గెలిచిన పతకాల పరంగా నాలుగో స్థానంలో ఉన్న గ్రేట్ బ్రిటన్.. మొత్తం 851 సమ్మర్ ఒలింపిక్ పతకాలను సాధించింది. ఇందులో 263 బంగారు పతకాలు, 295 రజతం, 293 కాంస్య పతకాలు ఉన్నాయి.

చైనా ఎక్కువ జనాభా కలిగిన చైనా దేశం.. సమ్మర్ ఒలింపిక్స్‌ ఆల్‌ టైమ్‌ పతకాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాలను పరిశీలిస్తే.. ఆసియా నుంచి అత్యధిక పతకాలు సాధించిన రెండో దేశం చైనానే. డ్రాగన్ అథ్లెట్స్‌ 224 స్వర్ణాలు, 167 రజతాలు, 155 కాంస్య పతకాలతో మొత్తం 546 పతకాలను సాధించారు.

ఫ్రాన్స్ ఇక ఫ్రాన్స్ దేశం మొత్తం 716 ఒలింపిక్స్ పతకాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఇందులో 212 బంగారు పతకాలు ఉన్నాయి. వీటితో పాటు 241 రజత, 263 కాంస్య పతకాలను ఆ దేశ ఆటగాళ్లు గెలుపొందారు.

ఇటలీ పతకాల పరంగా చూస్తే.. ఇటలీ దేశం 577 సమ్మర్ ఒలింపిక్ పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఇందులో 206 బంగారు పతకాలు, 178 రజత, 193 కాంస్య పతకాలు ఉన్నాయి.

హంగరీ మొత్తం 491 పతకాలతో ఇటలీ తర్వాతి స్థానంలో నిలిచింది హంగరీ దేశం. 175 బంగారు, 147 రజత, 169 కాంస్య పతకాలను సాధించి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా 497 పతకాలతో ఆస్ట్రేలియన్లు తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ దేశం ఇప్పటివరకు 147 స్వర్ణ పతకాలు, 163 రజత పతకాలు, 187 కాంస్య పతకాలు సాధించింది.

స్వీడన్ పతకాల పరంగా పదో స్థానంలో నిలిచింది స్వీడన్ దేశం. మొత్తం 494 పతకాలను సాధించిన ఈ దేశం.. ఆస్ట్రేలియా కంటే మూడు పతకాలను తక్కువగా సాధించింది. ఇందులో 145 బంగారు పతకాలు, 170 రజతం, 179 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఇండియా 28 ఒలింపిక్ పతకాలతో భారతదేశం.. కొలంబియా, స్లోవేకియా దేశాలతో పాటు 53వ స్థానంలో కొనసాగుతోంది. భారత అథ్లెట్స్ 9 బంగారు పతకాలు, 7 రజత, 12 కాంస్య పతకాలను సాధించారు.

Also Read:

Tokyo Olympics: ఒలింపిక్ స్వర్ణం కొడతాం..వారికి అంకితం ఇస్తాం..భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ప్రతిజ్ఞ!

Cristiano Ronaldo: ఈ సాఫ్ట్ డ్రింక్ వద్దు.. మంచినీరు తాగండి..! క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన..!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..