Tokyo Olympics: ఒలింపిక్ స్వర్ణం కొడతాం..వారికి అంకితం ఇస్తాం..భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ప్రతిజ్ఞ!

Tokyo Olympics: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. టోక్యోలో జరగబోతున్న ఈ పోటీల కోసం క్రీడాకారులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పోటీలకు తమ సర్వశక్తులూ ధారబోయటానికి సిద్ధం అవుతున్నారు.

Tokyo Olympics: ఒలింపిక్ స్వర్ణం కొడతాం..వారికి అంకితం ఇస్తాం..భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ప్రతిజ్ఞ!
Tokyo Olympics
Follow us
KVD Varma

|

Updated on: Jun 14, 2021 | 5:12 PM

Tokyo Olympics: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. టోక్యోలో జరగబోతున్న ఈ పోటీల కోసం క్రీడాకారులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పోటీలకు తమ సర్వశక్తులూ ధారబోయటానికి సిద్ధం అవుతున్నారు. భారతదేశం నుంచి ఒలింపిక్స్ కోసం హాకీ జట్టు టోక్యో వెళ్ళడానికి తయారు అవుతోంది. ఈ పోటీల్లో ఎలాగైనా స్వర్ణం సాధించాలని భారత హాకీ ఆటగాళ్ళు పట్టుదలతో ఉన్నారు. ఈ విషయాన్ని హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా ఉండిపోయిన ఒలింపిక్ పతకాల కరువును టోక్యోలో కచ్చితంగా తీరుస్తామని ఆయన చెబుతున్నారు. అంతేకాదు, టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించి..ఆ విజయాన్ని దేశంలోని కోవిడ్ యోధులకు అంకితం చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యోలో నిర్వహించనున్న ఒలింపిక్స్ కోసం తమ జట్టు సర్వ సన్నద్ధంగా ఉందని మన్‌ప్రీత్ సింగ్ అన్నారు. రాబోయే ఒలింపిక్స్ గేమ్స్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కచ్చితంగా పతకం సాధిస్తామని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమకు పతకం లభిస్తే, దానిని మన దేశంలోని నిజమైన హీరోలకు అంకితం చేయాలనుకుంటున్నామన్నారు. ఈ కఠినమైన సమయాల్లో మన దేశాన్ని స్వస్థపరిచేందుకు మరియు లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ధన్యవాదములు.” అని హాకీ ఇండియా విడుదల చేసిన వీడియోలో మన్‌ప్రీత్‌ వివరించారు.

41 ఏళ్లు..

హాకీకి పుట్టిల్లు అయిన భారతదేశం చివరిసారిగా 41 ఏళ్ల క్రితం ఒలింపిక్ పతాకాన్ని గెలిచింది. ఇప్పటివరకూ మొత్తం 8 సార్లు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచింది. చివరిసారిగా 1980 మాస్కో ఒలింపిక్స్ లో బంగారు పతాకాన్ని గెలుచుకుంది. ఆ తరువాత ఇప్పటివరకూ హాకీలో ఇండియాకు స్వర్ణ పతకం దక్కలేదు. ఈసారి ఎలాగైనా పతాకాన్ని సాధించాలని భారత్ జట్టు పట్టుదలతో ఉంది. బెంగళూరు కేంద్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎంపిక ట్రయల్స్ లో ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో భారత జట్టు ఈసారి కచ్చితంగా పతాకాన్ని తెస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.

Also Read: WTC Final: పంత్ సెంచరీ.. శుభ్‌మన్ మెరుపులు.. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ.. సన్నాహక మ్యాచ్‌ దూకుడు

French Open: ఫ్రెంచ్ ఓపెన్​లో సరికొత్త రికార్డు.. రెండు టైటిల్స్ ఆమె ఖాతాలోనే..