అయ్యప్ప భక్తులతో… 480 కిలోమీటర్లు నడిచిన శునకం!

మొన్నటి శనివారం భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయం తెరుచుకుంది. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. ఓ భక్త బృందం వెంట శబరిమలకు ఓ కుక్క కూడా పయనమైంది. దీని గురించి తెలిసినవారంతా దాని భక్తికి ముచ్చట పడుతున్నారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు కేరళకు అయ్యప్ప భక్తులు క్యూ కడుతూ ఉంటారు. మండలం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. […]

అయ్యప్ప భక్తులతో... 480 కిలోమీటర్లు నడిచిన శునకం!
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2019 | 6:09 PM

మొన్నటి శనివారం భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయం తెరుచుకుంది. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. ఓ భక్త బృందం వెంట శబరిమలకు ఓ కుక్క కూడా పయనమైంది. దీని గురించి తెలిసినవారంతా దాని భక్తికి ముచ్చట పడుతున్నారు.

కార్తీకమాసం వచ్చిందంటే చాలు కేరళకు అయ్యప్ప భక్తులు క్యూ కడుతూ ఉంటారు. మండలం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. తిరుమల నుంచి 13మంది భక్తులు అయ్యప్ప క్షేత్రానికి తరలి వెళ్లాలనుకున్నారు. అక్టోబర్‌ 31న తిరుమల నుంచి కాలి నడక ప్రారంభించారు. వీరి వెంట ఓ శునకం కూడా నడక ప్రారంభించింది. అయితే తమ వెంట కుక్క వస్తున్న విషయాన్ని వారు గమనించలేదు. కానీ వెనక్కు చూసిన ప్రతీసారి కుక్క ఉండటంతో వారి కళ్లను నమ్మలేకపోయారు. అలా స్వాములతో కలిసి ఆ కుక్క 480 కిలోమీటర్లు ప్రయాణించింది. స్వాములు ప్రతినిత్యం వారు తెచ్చుకున్నదాంట్లో కొంత ఆ కుక్కకు పెడుతూ దాని ఆకలి తీరుస్తూ వచ్చారు. సుధీర్ఘ ప్రయాణం అనంతరం వారు నవంబర్‌ 17న కర్ణాటకలోని కొట్టిగెరాకు చేరుకున్నారు.

తాము ప్రతి సంవత్సరం కాలినడకన శబరిమల వెళ్తామని, ఈ సారి ఇలా తమతో పాటు ఓ కుక్క రావటం ఆశ్చర్యంగా ఉందని స్వాములు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. శునక భక్తిని మెచ్చిన నెటిజన్లు దాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు.