AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

నిద్రలేవగానే పక్కబట్టలను నీట్‌గా సర్దడం క్రమశిక్షణతో కూడిన అలవాటుగా కనిపిస్తుంది. కానీ, ప్రతిరోజూ నిద్రలేచిన వెంటనే పక్కబట్టలు సర్దడం (Making the bed) ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ సర్దడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు వేచి ఉండాలని వారు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తప్పక తెలుసుకోవాల్సిందే..

నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!
Bed Hygiene Tips
Jyothi Gadda
|

Updated on: Apr 11, 2026 | 8:34 AM

Share

చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న మంచి అలవాట్లలో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. అయితే, తాజా ఆరోగ్య పరిశోధనలు దీనికి భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. లేవగానే బెడ్ సర్దడం వల్ల మనకే తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి సహజంగానే కొంత చెమట, చర్మ కణాలు వెలువడతాయి. ఇవి పక్కబట్టలపై (Bed sheets and blankets) పేరుకుపోతాయి. ఈ తేమ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు ప్రధాన ఆహారం. మనం లేవగానే దుప్పట్లు మడతపెట్టేస్తే, ఆ తేమ లోపలే ఉండిపోతుంది. దీనివల్ల డస్ట్ మైట్స్ వేగంగా వృద్ధి చెంది మన పక్కబట్టలను ఒక బ్యాక్టీరియా కేంద్రంగా మారుస్తాయి.

మనం నిద్రలేచిన తర్వాత దుప్పట్లను అలాగే వదిలేయడం వల్ల (Unmaking the bed), గదిలోని గాలి, వెలుతురు ఆ పక్కబట్టలకు తగులుతాయి. గాలి తగలడం వల్ల దుప్పట్లలోని తేమ ఆరిపోతుంది. డస్ట్ మైట్స్ బతకడానికి తేమ అవసరం. పొడి వాతావరణంలో అవి జీవించలేవు. ఇలా చేయడం వల్ల తుమ్ములు, జలుబు, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

నిద్రలేవగానే గది కిటికీలు తెరిచి తాజా గాలి లోపలికి వచ్చేలా చూడండి. మీరు తయారైన తర్వాత లేదా బ్రేక్‌ఫాస్ట్ ముగించిన తర్వాత బెడ్ సర్దడం అలవాటు చేసుకోండి. బెడ్ షీట్లను వారానికి ఒకసారి వేడి నీటితో ఉతకడం వల్ల మరింత రక్షణ లభిస్తుంది. నీట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యం. రేపటి నుండి నిద్రలేవగానే మీ బెడ్‌కు కొంచెం గాలిని, వెలుతురును ఇవ్వండి. ఆ తర్వాతే దాన్ని అందంగా సర్దుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు