Tollywood : స్టార్ హీరోయిన్ అయ్యేది.. ఒక్క వాన పాటతో సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు తల్లి పాత్రలతో ఫేమస్..
సినీరంగంలో కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయితే.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తల్లి, వదిన, అత్త పాత్రలతో ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఎన్నో హిట్ చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..

తెలుగు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. ఇప్పటివరకు తల్లిగా, అత్తగా, వదినగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆమె, ఒకప్పుడు హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించారనే విషయం చాలామందికి తెలియదు. అయితే, స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె ఎందుకు ఆ బాటను వదులుకున్నారు? దీని వెనుక ఉన్న ఒక చేదు అనుభవం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రగతి సినీ ప్రయాణం తమిళ దర్శకుడు భాగ్యరాజ్ సినిమాతో మొదలైంది. అతి తక్కువ సమయంలోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ, హీరోయిన్‌గా కొనసాగడం అనుకున్నంత సులభం కాదని ఆమెకు త్వరగానే అర్థమైంది. దీంతో ఆమె కథానాయికగా అవకాశాలు వదిలిపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
ఒక షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఆమెను తీవ్రంగా కలిచివేసిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సెట్‌లో కొందరు వ్యక్తుల ప్రవర్తన, హీరోయిన్ల పట్ల ఉండే భావన తనకు నచ్చలేదని తెలిపింది. ముఖ్యంగా తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి అక్కడ కొనసాగడం ఇష్టం లేక హీరోయిన్ అవకాశాలకు స్వస్తి పలికినట్లు తెలిపారు. ఆ సమయంలో తన నిర్ణయం సరైనదేనా అని చాలామంది ప్రశ్నించారని.. కానీ, మనశ్శాంతి లేని చోట ఎన్ని కోట్లు వచ్చినా వృధా అని ఆమె భావించినట్లు తెలిపారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, వివాహం చేసుకున్నారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రగతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
“హీరోయిన్‌గా కంటే ఇప్పుడు నేను చేస్తున్న పాత్రలే నాకు ఎక్కువ గౌరవాన్ని, గుర్తింపును ఇస్తున్నాయి” అని అన్నారు ప్రగతి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ఫిట్‌నెస్ వీడియోలు, డ్యాన్స్‌లతో యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఆమె ప్రత్యేకత అనే చెప్పాలి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‌తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
