AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా? కేవలం 10 నిమిషాల్లో ఇలా వేడి వేడిగా టేస్టీ దోశలుగా మార్చేసుకోండి..!

నిన్నటి మిగిలిపోయిన రొట్టెలతో (Leftover Roti) ఎంతో రుచికరమైన, కరకరలాడే దోశలు తయారు చేసుకోవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది కేవలం 10-15 నిమిషాల్లో సిద్ధమవుతుంది. పిల్లలకు లంచ్ బాక్స్‌లో లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇది ఒక బెస్ట్‌ అండ్‌ సూపర్‌ ఫుడ్‌ అని చెప్పొచ్చు.. దీనివల్ల ఆహారం వృథా కాదు సరికదా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. ఈ కొత్త వంటకాన్ని వెంటనే ట్రై చేయండి..

మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా? కేవలం 10 నిమిషాల్లో ఇలా వేడి వేడిగా టేస్టీ దోశలుగా మార్చేసుకోండి..!
Chapati
Jyothi Gadda
|

Updated on: Apr 11, 2026 | 8:23 AM

Share

సాధారణంగా రాత్రి పూట రొట్టెలు మిగిలిపోతే ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఆ మిగిలిన రొట్టెలతో ఎంతో రుచికరమైన, కరకరలాడే రొట్టె దోశను తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం ఇక్కడ ఉంది.

కావలసిన పదార్థాలు:

మిగిలిపోయిన రొట్టెలు (3-4)

ఇవి కూడా చదవండి

శనగపిండి (Besan) – అర కప్పు

పెరుగు – 2 స్పూన్లు

తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, కొత్తిమీర

అల్లం వెల్లుల్లి పేస్ట్

ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా

నూనె లేదా నెయ్యి

తయారీ విధానం:

ముందుగా మిగిలిపోయిన రొట్టెలను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో రొట్టె పొడి, శనగపిండి, పెరుగు వేసి బాగా కలపాలి. అందులో తరిగిన కూరగాయలు, మసాలాలు, సరిపడా నీరు పోసి దోశ పిండిలా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పెనంపై పోసి గుండ్రంగా పరుచుకోవాలి. రెండు వైపులా ఎర్రగా, కరకరలాడే వరకు కాల్చుకోవాలి.

ఈ రెసిపీ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆహారం వృథా కాకుండా ఉంటుంది. గోధుమ రొట్టెలు, కూరగాయలు ఉండటం వల్ల ఫైబర్, ప్రోటీన్లు అందుతాయి. ఉదయం హడావిడిగా ఉన్నప్పుడు త్వరగా బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకోవచ్చు. ఈ రొట్టె దోశను టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో రొట్టెలు మిగిలితే ఈ కొత్త రెసిపీని తప్పకుండా ట్రై చేయండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు