Check IT Refund Status: ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా..? రిఫండ్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
Steps To Know IT Refund Status: కరోనా నేపథ్యంలో గడువు పొడగిస్తూ వచ్చినా ఐటీ రిట్నర్ ధాఖలు చివరికి పూర్తయ్యింది. దేశంలో పన్ను చెల్లించే వారు ఆదాయ పన్నుకు మించి చెల్లించిన..
Steps To Know IT Refund Status: కరోనా నేపథ్యంలో గడువు పొడగిస్తూ వచ్చినా ఐటీ రిట్నర్ ధాఖలు చివరికి పూర్తయ్యింది. దేశంలో పన్ను చెల్లించే వారు ఆదాయ పన్నుకు మించి చెల్లించిన మొత్తాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు ద్వారా తిరిగి పొందొచ్చు. దీనినే ఐటీ రిటర్న్స్ అంటారు. అధికంగా చెల్లించిన పన్నును ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 237 కింద రీక్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఐటీ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత… రిఫండ్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఇందుకోసం రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
ఈ-ఫైలింగ్ పోర్టల్..
* ఈ విధానంలో మొదట ఐటీ విభాగ ఈ-ఫైలింగ్ పోర్టల్ (www.incometaxindiaefiling.gov.in/home) ఓపెన్ చేయాలి. * అనంతరం ‘వ్యూ రిటర్న్స్ ఫామ్స్’ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. * తర్వాత ‘ఎక్నాలెడ్జ్‌మెంట్ నంబర్’పై క్లిక్ చేసి.. సదరు ఎక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. * వెంటనే మీ రిఫండ్ స్టేటస్ ప్రత్యక్షమవుతుంది.
ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్..
* మొదట ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్(https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html)ను ఓపెన్ చేయాలి. * అనంతరం ఓపెన్ అయిన ఫామ్‌లో మీ పాన్ నెంబర్‌తో పాటు అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంటర్ చేసి.. ప్రొసీడ్ బటన్‌పై క్లిక్ చేయాలి. * వెంటనే రిఫండ్ స్టేటస్ లభిస్తుంది.