స్టార్ డైరెక్టర్ శివ ఇంట విషాదం .. అనారోగ్యంతో కన్నుమూసిన శివ తండ్రి జయకుమార్ 

తమిళ తెలుగు భాషల్లో సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు శివ ఇంట విషాదం చోటుచేసుకుంది. శివ తండ్రి జయకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయకుమార్ చెన్నైలో కన్నుమూశారు...

స్టార్ డైరెక్టర్ శివ ఇంట విషాదం .. అనారోగ్యంతో కన్నుమూసిన శివ తండ్రి జయకుమార్ 
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2020 | 1:23 PM

తమిళ తెలుగు భాషల్లో సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు శివ ఇంట విషాదం చోటుచేసుకుంది. శివ తండ్రి జయకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయకుమార్ చెన్నైలో కన్నుమూశారు. దాంతో శివ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.శివ తెలుగులో గోపీచంద్ హీరోగా’శౌర్యం’సినిమా దర్శకుడిగా మారారు.

ఆతర్వాత వెంటనే గోపీచంద్ తోనే’శంఖం’అనే సినిమా చేశారు.ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రవితేజ హీరోగా ‘దరువు’ అనే సినిమా చేసినా అదికూడా హిట్ అవ్వలేదు ఆతర్వాత విక్రమార్కుడు సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత అజిత్ తో వరుసగా సూపర్ హిట్ సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం శివ రజినీకాంత్ తో ‘అన్నాత్తై’ సినిమా చేస్తున్నాడు. శివ తండ్రి జయకుమార్ షార్ట్ ఫిలిం మేకర్ గా దాదాపు 400 సినిమాలకు పనిచేశారు. జయకుమార్ మృతికి తమిళ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తంచేసింది. తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న శివను సినీప్రముఖులు పరామర్శిస్తున్నారు.