Breaking పోలీస్ వెహికిల్స్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్

కరోనా నియంత్రణలో ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పని చేస్తున్న పోలీసుల ఆరోగ్యంపై, వారి ప్రాణాలపై దృష్టి సారించారు పోలీసు బాసులు. 24 గంటల పాటు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే వారి వ్యక్తిగత ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్జితి పోలీసన్నలది.

Breaking పోలీస్ వెహికిల్స్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్
Follow us

|

Updated on: Apr 17, 2020 | 2:13 PM

కరోనా నియంత్రణలో ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ పని చేస్తున్న పోలీసుల ఆరోగ్యంపై, వారి ప్రాణాలపై దృష్టి సారించారు పోలీసు బాసులు. 24 గంటల పాటు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే వారి వ్యక్తిగత ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్జితి పోలీసన్నలది. అందుకే వారిని రక్షించుకునేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని భావించారు పోలీసు బాసులు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది.

కరోనా వైరస్ వాహనాల ద్వారా వ్యాప్తి చెందకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పరికరంతో ఫాగ్ శానిటైజేషన్ చేస్తున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. ప్రతి పోలీసు వాహనంలో ఫాగ్ శానిటైజేషన్ చేయిస్తున్నారు. దాని వలన వచ్చే మూడు నెలల వరకు ఎలాంటి బ్యాక్టీరియా వాహనాల్లోకి చేరదన్న ఉద్దేశంతో ఫాగ్ శానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఫాగ్ శానిటైజేషన్ శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఫాగ్ శానిటైజేషన్‌తో తీసుకుంటున్న ప్రివెంటివ్ యాక్టివిటీస్ పోలీసుల్లో భద్రతాభావాన్ని పెంచుతాయని కింది స్థాయి పోలీసు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.