2050నాటికి 10 లక్షలమందిని అక్కడికి పంపిస్తాడట.. మీరూ వెళతారా?

శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ 2050 నాటికి 10 లక్షల మందిని అంగారక గ్రహానికి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భూమి మీది నుంచి రోజుకు 3 ఫ్లైట్లను అంగారకుడిపైకి నడపాలని కంకణం కట్టుకున్నాడు. అంటే ఏడాదికి దాదాపు 1,000 ఫ్లైట్లు భూమి మీద నుండి మార్స్ పైకి ఎగరాలి. హైదరాబాద్ నుంచి అమెరికాకు రోజుకు ఒకటో రెండో డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. కానీ ఎలాన్ మస్క్ చెప్పేది వింటే దిమ్మ తిరగటం ఖాయం. […]

2050నాటికి 10 లక్షలమందిని అక్కడికి పంపిస్తాడట.. మీరూ వెళతారా?
Follow us

| Edited By:

Updated on: Jan 20, 2020 | 3:28 PM

శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ 2050 నాటికి 10 లక్షల మందిని అంగారక గ్రహానికి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భూమి మీది నుంచి రోజుకు 3 ఫ్లైట్లను అంగారకుడిపైకి నడపాలని కంకణం కట్టుకున్నాడు. అంటే ఏడాదికి దాదాపు 1,000 ఫ్లైట్లు భూమి మీద నుండి మార్స్ పైకి ఎగరాలి. హైదరాబాద్ నుంచి అమెరికాకు రోజుకు ఒకటో రెండో డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. కానీ ఎలాన్ మస్క్ చెప్పేది వింటే దిమ్మ తిరగటం ఖాయం. ఎందుకంటే, ఇప్పటివరకు అంగారకుడిపై అసలు ఒక్క మనిషి కూడా అడుగుపెట్టలేదు. 2025 లో మాత్రమే అది సాధ్యమని అంటున్నారు.

స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రం ఏకంగా 10 లక్షల మందిని తీసుకెళతానని లెక్కలు కట్టి మరీ చెబుతుండటం విశేషం. అంగారకుడిపై మానవులు ఉండేలా వాతావరణాన్ని సృష్టించేందుకు కనీసం 1 మెగా టన్ను (10 లక్షల టన్నులు) పదార్ధం అవసరం. ఇందుకోసం ప్రతి 10 ఫ్లైట్ల లో ఒక మెగా టన్ను సరుకులను మోసుకు పోగలమని అయన అంచనా. ఎలాన్ మస్క్ ట్వీట్ల ఆధారంగా ప్రముఖ వార్త ఏజెన్సీ ఐ ఏ ఎన్ ఎస్ ఒక కథనాన్ని ప్రచురించింది.

స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రస్తుతం ప్రొటోటైప్ రాకెట్ల తయారీలో నిమగ్నమై ఉంది. అంగారకుడి పైకి వెళ్లే స్టార్‌షిప్ విమానాల తయారీ జరుగుతోంది. ఈ విమానాలు అన్నీ కూడా అటు ప్రయాణికులను మోసుకెళ్ళటంతో పాటు సరుకులను కూడా మోసుకెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించేందుకు పనికి వచ్చేలా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగారకుడి పై తమ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కొన్ని ల్యాండింగ్ స్లాట్ లు (ప్రదేశాలు) కేటాయించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ను స్పేస్ ఎక్స్ అనుమతి కోరుతోంది. ఏడాదికి 1,000 స్టార్షిప్ లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.