పెళ్లి మంత్రాలతో పాటు కరోనా నియంత్రణ సూత్రాలు… పోలీసు బాసే పూజారి స్థానంలో… వైరల్ అవుతున్న కొత్త పెళ్లి తంతు…

పెళ్లి మండపంలో వధువు, వరుడు ఉన్నారు. పూజారి వేద మంత్రాలు చదువుతున్నారు. సడన్‌గా పెద్ద పోలీసు ఆఫీసర్ మండపానికి వచ్చాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 5:48 pm, Sun, 6 December 20
పెళ్లి మంత్రాలతో పాటు కరోనా నియంత్రణ సూత్రాలు... పోలీసు బాసే పూజారి స్థానంలో... వైరల్ అవుతున్న కొత్త పెళ్లి తంతు...

SP sits in mandap, makes bride and groom take Covid-19 safety pledge in U’khand పెళ్లి మండపంలో వధువు, వరుడు ఉన్నారు. పూజారి వేద మంత్రాలు చదువుతున్నారు. సడన్‌గా పెద్ద పోలీసు ఆఫీసర్ మండపానికి వచ్చాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఎం జరిగిందో తెలుసా….

ఉత్తరాఖండ్ రాష్ర్టం బాగేశ్వర్ జిల్లాలోని ఒక ఫంక్షన్ హాల్లో నూతన వధువరుల పెళ్లి జరుగుతోంది. అక్కడి ఆ జిల్లా ఎస్పీ మణికాంత్ మిశ్రా వచ్చారు. వేదికపైకి వెళ్లారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పక్కన కూర్చున్నారు. వేద మంత్రాలు చదువుతున్న పూజారితో తాను పూజారిలా మారారు. అయితే ఆయన చదివింది వేద మంత్రాలు కాదు… కరోనా నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల సూత్రాలు… తాను చేసిన పనిపై స్పందించిన ఎస్పీ ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయని అన్నారు.

మంగళసూత్రాలతో పాటు కరోనా నియంత్రణ సూత్రాలు…

పోలీసులు నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్నారని, ఈ క్రమంలోనే కరోనా నిబంధనలు అందరు పాటించేలా చూస్తున్నామని ఎస్పీ తెలియజేశారు. డ్యూటీలో భాగంగా పెళ్లి మండపానికి వచ్చామని తెలిపారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక సందర్భమని, ఆ సమయంలో కరోనా నియంత్రణ చర్యలు చెబితే అవి అందరికి బలంగా చేరుతాయని, పెళ్లి తంతులో కరోనా నియంత్రణ సూత్రాలు చదివించామని వివరించారు. పూజారులు కూడా తర్వాతి రోజుల్లో పెళ్లి తంతుతో పాటు కరోనా నియంత్రణ చర్యలను వధువరులతో చెప్పించాలని కోరారు. ఎస్పీ చేసిన ఈ పని నెట్టింట వైరల్ గా మారింది.