AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SonuSood Mother: ‘రియల్‌ హీరో’కు మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఫ్యాన్స్‌.. భావోద్వేగానికి గురైన సోనూసూద్‌..

Sonu Mother Name For: తాజాగా సోనూసూద్‌కు తన సొంతూరు ప్రజలు మరిచిపోలేని ఓ గొప్ప బహుమతి ఇచ్చారు. పంజాబ్‌లోని సోనూసూద్‌ సొంత పట్టణం మోగాలోని..

SonuSood Mother: 'రియల్‌ హీరో'కు మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఫ్యాన్స్‌.. భావోద్వేగానికి గురైన సోనూసూద్‌..
Narender Vaitla
|

Updated on: Jan 01, 2021 | 4:12 PM

Share

Sonu Mother Name For: కరోనా కష్ట సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి రియల్‌ హీరోగా మారారు నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూ ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిలో రియల్‌ హీరోగా మారాడు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలంతా సోనూసూద్‌కు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణలో ఏకంగా గుడికట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సోనూసూద్‌కు తన సొంతూరు ప్రజలు మరిచిపోలేని ఓ గొప్ప బహుమతి ఇచ్చారు.

రోడ్డుకు తల్లి పేరు పెట్టడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన సోనూసూద్..

పంజాబ్‌లోని సోనూసూద్‌ సొంత పట్టణం మోగాలోని ఓ రోడ్డుకు సోనూ తల్లి ‘సరోజ్‌ సూద్‌’ పేరి పెట్టి అభిమానం చాటుకున్నారు కొందరు ఫ్యాన్స్‌. ఈ రోడ్డును తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ విషయమై స్పందించిన సోనూ భావోద్వేగానికి గురయ్యాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ రోడ్‌’ నా జీవితమంతా కలలుగన్న ఒక అద్భుత దృశ్యం. నా జీవితంలో ఈ సంఘటన ప్రధాన అధ్యాయంగా ఎప్పిటికీ నిలిచిపోతుంది. మా అమ్మ ప్రతిరోజూ ఇదే రోడ్డుపై ఇంటి నుంచి కాలేజీకి, అక్కడి నుంచి ఇంటికి వచ్చేది. ఇది చూసి స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని నా నమ్మకం. రోడ్డుకు మా అమ్మ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు. ఇకపై ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ప్రొఫెసర్ సరోజ్‌సూద్ రోడ్’ అని నేను ఎంతో గర్వంగా చెప్పగలను’ అని చెప్పుకొచ్చాడు. ఇక సోనూసూద్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’తో పాటు బెల్లం కొండ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే ఆకట్టుకున్న సోనూ.. ఇకపై నిర్మాతగా, హీరోగా కూడా మారనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: WhatsApp to Stop Working : అనుకున్నదే జరిగింది.. మిలియన్ల కొద్ది ఫోన్లలో నిలిచిపోయిన వాట్సప్ సేవలు..