AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదుగురు పిల్లలు ఉన్నా.. అనాథగా మారిన తల్లి

మనషుళ్లో మానవత్వం కరువవుతోంది. బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు కన్నవారిని సైతం కనికరం చూపకుండా రోడ్డనపడేస్తున్నారు. ఐదుగురు పిల్లలు కున్న ఆ అమ్మ అనాథగా మారింది.

ఐదుగురు పిల్లలు ఉన్నా.. అనాథగా మారిన తల్లి
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 9:31 PM

Share

మనషుళ్లో మానవత్వం కరువవుతోంది. బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు కన్నవారిని సైతం కనికరం చూపకుండా రోడ్డనపడేస్తున్నారు. ఐదుగురు పిల్లలు కున్న ఆ అమ్మ అనాథగా మారింది. కని పెంచి పెద్ద చేసిన అమ్మను రోడ్డుపైకి నెట్టేశారు. ఆస్తి కోసం వెంపర్లాడుతూ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్ కు చెందిన పెదకోట్ల చిన్నమ్మకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు కాగా, ముగ్గురు కొడుకులు. 37 ఏళ్ల క్రితం భర్త చనిపోయినా కష్టపడి పిల్లలను చదివించి ప్రయోజకులను చేసింది. ఉన్న ఆస్తిని ఐదు భాగాలుగా చేసి ఇచ్చింది. కొడుకులు అంథోని , అగస్తీన్, శివతో పాటు ఇద్దరు కూతుర్లకు సమానంగా ఆస్తి పంపకాలు చేసింది. అందరికి పెళ్లి చేసి వంతుల వారిగా పిల్లల వద్ద ఉంటోంది. ఇదే ఆమె పిల్లలకు భారంగా మారింది. తమ వల్ల కాదంటే తమ వల్ల కాదని బయటకు గెంటాశారు పిల్లలు. దీంతో ఎదీ దిక్కులేని ఆ తల్లి రోడ్డుపై న్యాయం కావాలంటూ రోదిస్తోంది.

ఇదిలావుంటే, చిన్న కొడుకు శివ ఆమె ఆస్తి కాజేసేందుకు ప్లాన్ వేశాడు. తల్లిని చేరదీసినట్లు నటించి ఆమె దగ్గరున్న ఆస్తినంతా కొట్టేశాడు. కొత్తగా కంపెనీ ప్రారంభిస్తున్నామని నమ్మబలికి బ్యాంకు రుణాల కోసం తన సంతకాలు హామీగా కావాలని కోరడంతో పత్రాల మీద సంతకాలు చేశారు. అలా ఆమె దగ్గరున్న డబ్బు, ఆస్తి మొత్తం కాజేశాడు. 70 ఏళ్ల వయసున్న తల్లిని మోసం చేస్తున్నామనే బాధ లేకుండా ఆమె దగ్గరున్న మొత్తం కాజేశారు. ఇక ఆ వృద్ధురాలి దగ్గర ఏమీ లేకపోవడంతో రెండేళ్లుగా ఆమెను సరిగా పట్టించుకోవడం మానేశారు. అంతేకాదు చీటికిమాటికీ ఇబ్బందులకు గురిచేస్తూ కొడుకులు, కోడళ్లు టార్చర్‌ చేస్తున్నారు. అడపా దడపా కూతుర్లు చేరదీసినా వాళ్లను కొడుకు వచ్చి బెదిరించడంతో పెద్దల సమక్షంలో సర్ధి చెప్పారు. అయినా పంతా మారని కొడుకు తల్లిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. దీంతో మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది.

తాజాగా చిన్న కూతురు కూడా అస్థి కోసం వేధింపులకు గురిచేసింది. తన ఇంట్లో ఉండటానికి వీలు లేదంటూ తరిమేసింది. ఇంటికి రావద్దని ఇటు కూతుర్లు, అటు కొడుకులు గెంటేశారు. కోడళ్ల సూటిపోటి మాటలతో ఆ తల్లి గుండె బరువెక్కింది. ఇంట్లో ఉండేది లేదంటూ ఆమెను బయటకు గెంటేశారు. అంతేకాదు తన బట్టలు కూడా కనిపించొద్దంటూ రోడ్డుపైకి విసిరేశారు. దీంతో దిక్కుతోచనిస్థితికి చేరిన ఆ తల్లి నివసించే చిన్న కుమారుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్తి లాక్కోవడమే గాకుండా తనను ఇంటి నుంచి గెంటేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Follow Us
జైపూర్ విమానాశ్రయంలో మరో విమానం హైజాక్ కలకలం
జైపూర్ విమానాశ్రయంలో మరో విమానం హైజాక్ కలకలం
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు..
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
వినూత్న సాగుతో జాతీయ అవార్డు నెగ్గిన జగిత్యాల మహిళా రైతు!
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. ఎంత అందంగా ఉందో చూశారా? వీడియో
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..