ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..

ముంబై మహా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 9:27 PM

IMD warns old buildings in Mumbai at risk: ముంబై మహా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై మరియు పరిసర ప్రాంత జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ఉదయం 6 గంటలనుండి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. దీంతో స్థానికుల్లో భయం నెలకొంది . ముంబై మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దని ఐఎండి సూచించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ఐఎండి హెచ్చరించింది. ప్రాంతీయ వాతావరణ శాఖ చెబుతోన్న వివరాల మేరకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అవుతాయని , విద్యుత్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

[svt-event date=”03/07/2020,9:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]