స్టూడెంట్‌పై 14 మంది అసహజ లైంగిక దాడి…చివరకు

రేపటితరం భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎంతగా అభివృద్ది చెందుతున్నామో, మానసికంగా అంతకంటే దిగజారిపోతున్నాం. కౌమార దశలో యువతకు కౌన్సిలింగ్ అవసరం. అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు ఇద్దరూ వారిలో మానసిక పరివర్తన దిశగా బీజాలు వేయాలి. కేవలం చదువులు చాలనే భావన ఎంతమాత్రం కరెక్ట్ కాదు. లేకపోతే విపరీత పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి సంఘటననే మీకు వివరించబోతున్నాం. మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి చంద్రాపూర్‌లోని సేవాదళ్ వసతి గృహంలో ఉంటూ […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:55 pm, Wed, 22 January 20
స్టూడెంట్‌పై 14 మంది అసహజ లైంగిక దాడి...చివరకు

రేపటితరం భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎంతగా అభివృద్ది చెందుతున్నామో, మానసికంగా అంతకంటే దిగజారిపోతున్నాం. కౌమార దశలో యువతకు కౌన్సిలింగ్ అవసరం. అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు ఇద్దరూ వారిలో మానసిక పరివర్తన దిశగా బీజాలు వేయాలి. కేవలం చదువులు చాలనే భావన ఎంతమాత్రం కరెక్ట్ కాదు. లేకపోతే విపరీత పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి సంఘటననే మీకు వివరించబోతున్నాం.

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి చంద్రాపూర్‌లోని సేవాదళ్ వసతి గృహంలో ఉంటూ ఓ కుర్రాడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆ హాస్టల్ అతనితో పాటు ఉండే కొందరు విద్యార్థులు అతనిపై అసహజ లైంగిక దాడికి పాల్పాడ్డారు. గత కొన్ని నెలలుగా అతనికి టార్చర్ చూపిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోవాలే అర్థం కాక మౌనంగానే సదరు విద్యార్థి ఆ బాధను భరించాడు. కానీ వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో ఇక చావే శరణ్యం అనుకున్నాడు. తన మన వేదనను 18 పేజీల లేఖలో రాసి..ఉరివేసుకుని తనువు చాలించాడు. జనవరి 18న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వాచ్‌మెన్‌తో పాటు 14 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.