‘సీఏఏపై వారితో కాదు.. నాతో చర్చకు రండి’.. అమిత్ షాకు ఒవైసీ సవాల్
సీఏఏపై ప్రతిపక్షనేతలు తనతో చర్చకు రావాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సవాలుకు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. (మంగళవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లేదా మాయావతి ఎవరైనా సరే.. తనతో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు). అయితే వారితో చర్చ ఎందుకు.. దమ్ముంటే నాతో చర్చకు రండి అని ఒవైసీ ప్రతిసవాల్ విసిరారు. బుధవారం […]

సీఏఏపై ప్రతిపక్షనేతలు తనతో చర్చకు రావాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సవాలుకు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. (మంగళవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లేదా మాయావతి ఎవరైనా సరే.. తనతో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు). అయితే వారితో చర్చ ఎందుకు.. దమ్ముంటే నాతో చర్చకు రండి అని ఒవైసీ ప్రతిసవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. నేనిక్కడే ఉన్నాను..(తనను ఉద్దేశిస్తూ) ఒక గడ్డం వ్యక్తితో డిబేట్‌కు రండి.. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్నార్సీ.. వీటిపై నేను చర్చకు రెడీ.. మీ ప్రశ్నలకు నేను సరైన సమాధానం చెబుతాను ‘ అన్నారు
‘హల్వా పదం ఎక్కడి నుంచి వచ్చింది ‘?
కేంద్ర బడ్జెట్ ప్రతులను పార్లమెంటుకు సమర్పించే ముందు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ‘ హల్వా సెరిమనీ’ని నిర్వహించే సాంప్రదాయక పధ్దతిని ఒవైసీ ప్రశ్నించారు. హల్వా అన్నది అరబిక్ పదమని, హిందీ గానీ, ఉర్దూ పదం గానీ కాదని ఆయన అన్నారు. ఈ పేరును మారుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, అయితే అసలీ పదం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఒవైసీ పేర్కొన్నారు. ఇదే పదాన్ని వినియోగిస్తున్నారంటే మీరు అరబ్ దేశస్థులా అని ఆయన సూటిగా వ్యాఖ్యానించారు.



