హైకోర్టుకు అమరావతి వివాదం..

అమరావతి వివాదం కోర్టుకెక్కింది. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు, హైకోర్టు అంశాలపై విచారణ జరుగుతోంది. మండలిలో జరుగుతున్న చర్చను అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం మెజార్టీ సభ్యులున్నారన్న కారణంతో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నందున.. నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అయితే మండలిలో చర్చ జరుగుతున్న అంశాన్ని కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లడంతో.. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా […]

హైకోర్టుకు అమరావతి వివాదం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 22, 2020 | 5:16 PM

అమరావతి వివాదం కోర్టుకెక్కింది. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు, హైకోర్టు అంశాలపై విచారణ జరుగుతోంది. మండలిలో జరుగుతున్న చర్చను అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం మెజార్టీ సభ్యులున్నారన్న కారణంతో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నందున.. నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

అయితే మండలిలో చర్చ జరుగుతున్న అంశాన్ని కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లడంతో.. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రాజధాని గ్రామాల్లో 144, యాక్ట్‌ 30 అమలుపైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. దానిపై కూడా విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది ధర్మాసనం. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామని, కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరడంతో వాయిదా తప్పలేదు.

Latest Articles