భర్తను బంధించి భార్య, పన్నెండేళ్ల కూతురుపై అఘాయిత్యం

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన కసాయి గుండెలకు భయం మాత్రం కలగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో కీచకులు రెచ్చిపోయారు. భర్తను బంధించి అతడి భార్య, కూతరిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 1:25 am, Mon, 3 August 20
భర్తను బంధించి భార్య, పన్నెండేళ్ల కూతురుపై అఘాయిత్యం

ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన కసాయి గుండెలకు భయం మాత్రం కలగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో కీచకులు రెచ్చిపోయారు. భర్తను బంధించి అతడి భార్య, కూతరిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలో ఓ కుటుంబం నివాసముంటోంది. ఆదివారం ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భర్తను తాళ్లతో బంధించి అతడి భార్యను 12 ఏళ్ల కూతురిని అపహరించుకుని వెళ్లిపోయారు. వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లిన ఆరుగురు కిరాతకులు సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. బాధితుల ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ కూడా లాక్కెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం నేరంతో పాటూ పాక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. బాధితురాళ్లను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.