చైనా కంపెనీలతో అమెరికా దేశభద్రతకు ముప్పు: పాంపియో

చైనా కంపెనీలతో అమెరికా దేశభద్రతకు ముప్పు: పాంపియో

చైనాను మరో గట్టి దెబ్బ కొట్టేందుకు అమెరికా రెడీ అవుతోంది. చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వెల్లడించారు. చైనాకు చెందిన కంపెనీల వల్ల అమెరికా దేశభద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆయన అన్నారు.

Balaraju Goud

|

Aug 03, 2020 | 1:04 AM

చైనాను మరో గట్టి దెబ్బ కొట్టేందుకు అమెరికా రెడీ అవుతోంది. చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వెల్లడించారు. చైనాకు చెందిన కంపెనీల వల్ల అమెరికా దేశభద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆయన అన్నారు. అమెరికన్ల డేటాను చైనా ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని పాంపియో తెలిపారు. ఇక, ఇప్పటికే టిక్‌టాక్ యాప్‌ను శనివారం లోపు బ్యాన్ చేసే‌లా ఆర్డర్‌ను జారీ చేస్తానంటూ అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

చైనా కంపెనీలను కట్టడి చేసేందుకు తాము సిద్దమవుతున్నామని మైక్ పాంపియో అన్నారు. అమెరికాలో టిక్‌టాక్ నాలుగు కోట్ల మంది టిక్‌టాక్ యాప్‌ను వాడుతున్నారు. ఈ యాప్ ద్వారా చైనా తనకు అనుకూలంగా ఉన్న పార్టీకి మద్దతు పలికేలా ఉన్నాయంటూ కొందరు సెనేటర్లు టిక్‌టాక్ బ్యాన్ చేయాలన్న ప్రతిపాదనలు చేశారు. అటు, అమెరికన్ల డేటాను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకుంటోందని అమెరికా న్యాయనిపుణులు సైతం వాదిస్తున్నారు. ఈ యాప్‌ను వెంటనే నిషేధించాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వైట్‌హౌస్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌కు అప్పగించేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్ సెనెటర్ లిండ్‌సే గ్రహమ్‌తో పాటు రిపబ్లికన్ పార్టీకి చెందిన అనేక మంది మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu