ప్రముఖ సింగర్ జేసుదాసు సోదరుడు అనుమానస్పద మృతి!

లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ కేజే జేసుదాస్ తమ్ముడు కేజే జస్టిన్(62) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 62 ఏళ్ల వయసున్న ఆయన గురువారం కొచ్చిలోని వల్లర్పాడంలోని బ్యాక్ వాటర్స్‌ వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం చర్చికి వెళ్లిన కేజే జస్టిన్.. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జస్టిన్‌ కోసం దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే బ్యాక్ వాటర్స్‌లో ఓ మృతదేహం […]

ప్రముఖ సింగర్ జేసుదాసు సోదరుడు అనుమానస్పద మృతి!

లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ కేజే జేసుదాస్ తమ్ముడు కేజే జస్టిన్(62) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 62 ఏళ్ల వయసున్న ఆయన గురువారం కొచ్చిలోని వల్లర్పాడంలోని బ్యాక్ వాటర్స్‌ వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం చర్చికి వెళ్లిన కేజే జస్టిన్.. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జస్టిన్‌ కోసం దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే బ్యాక్ వాటర్స్‌లో ఓ మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో.. జస్టిన్ మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యా.. హత్యా.. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఆయన చర్చి తర్వాత ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? ఎవరితో మాట్లాడారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా.. జేసుదాస్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన వెంటనే కేరళకు చేరుకున్నారు. అయితే కేరళలోనే జస్టిన్ తుదికర్మ జరగనుందని అతని భార్య పేర్కొన్నారు.

Published On - 8:20 am, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu