సిద్దిపేట‌ టిక్‌టాక్‌ సింగర్‌ రాజు ఆత్మహత్య

టిక్‌టాక్ ద్వారా చాలా మంది ప్ర‌తిభావంతులు ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మ‌య్యారు. అలానే ప‌ల్లె పాట‌ల‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న‌‌ సిద్దిపేటకు చెందిన రాజు గ‌డ్డం రాజు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సిద్దిపేట‌ టిక్‌టాక్‌ సింగర్‌ రాజు ఆత్మహత్య
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 02, 2020 | 2:42 PM

Tik tok singer raju died : టిక్‌టాక్ ద్వారా చాలా మంది ప్ర‌తిభావంతులు ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మ‌య్యారు. అలానే ప‌ల్లె పాట‌ల‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న‌‌ సిద్దిపేటకు చెందిన గ‌డ్డం రాజు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు స్వ‌స్థ‌లం కోడూరు మండలం గంగాపూర్‌ గ్రామం. వ్యవసాయం పొలం వద్ద ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని అత‌డు సూసైడ్ చేసుకున్నాడు. ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడని చెప్పుమ్మ’ అనే పాటతో అతడు బ‌హుళ ప్ర‌జాధార‌ణ సంపాదించాడు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైర‌లైంది. కాగా రాఖీ పండగకు ఒక రోజు అత‌డు మ‌ర‌ణించ‌డంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజు మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని వివరాలను సేకరించి..ద‌ర్యాప్తు ప్రారంభించారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Read More : షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్