AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్

కల్లు ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. సాధారణ కల్లు తాగితే ఫరవాలేదనుకునే కల్లు ప్రియులు అందులో ఏమేమి కలుపుతారో తెలుసుకుంటే షాక్ గురవక తప్పదు. సాధారణ కల్లు తాగితే...

కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్
Rajesh Sharma
|

Updated on: Nov 03, 2020 | 4:52 PM

Share

Shocking news to taddy lovers: కల్లు ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. సాధారణ కల్లు తాగితే ఫరవాలేదనుకునే కల్లు ప్రియులు అందులో ఏమేమి కలుపుతారో తెలుసుకుంటే షాక్ గురవక తప్పదు. సాధారణ కల్లు తాగితే.. కస్టమర్లు రెగ్యులర్‌గా తమ షాపులోకి రారనుకున్నాడో ఏమో.. ఓ కల్లు విక్రేత ఏకంగా అందులో గంజాయి కలిపి మరీ విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు సదరు కల్లు విక్రేతను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో కల్లులో గంజాయి కలిపి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లు దుకాణానికి ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో కల్లులో గంజాయి కలిపి విక్రయిస్తున్నా సురేష్ గౌడ్ అనే కల్లు దుకాణం యజమాని.

విషయం తెలుసుకున్న పోలీసులు సురేష్ గౌడ్ విక్రయిస్తున్న కల్లు దుకాణాన్ని తనిఖీ చేశారు. అతన్నుంచి 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కల్లు తాగే వారికి మరింత మత్తు రావాలని అందులో గంజాయిని పొడి చేసి కలుపుతున్నానని సురేష్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సాచారం. సురేష్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే సురేష్‌కు గంజాయిని విక్రయిస్తున్న కర్నాటకకు చెందిన హుస్సేనయ్య గౌడ్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

ALSO READ: రెవెన్యూ అధికారిని చితక్కొట్టిన మహిళా రైతు

ALSO READ: అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు