AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్!

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన ఒక మహిళ దహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే, కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసును ఛేదించిన తీరు చూసి స్వయంగా పోలీసులే కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్!
Murder Mystery
P Shivteja
| Edited By: |

Updated on: Aug 16, 2026 | 9:15 PM

Share

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం..

భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్‌తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. విజయకు ఉన్న కుటుంబ గొడవలను ఆసరాగా చేసుకుని, ఆమెను తమ ఇంటికి పిలిపించారు. నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్లి.. తల్లి, కొడుకు కలిసి విజయ గొంతు పిసికి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారు.

రాత్రి సమయంలో మృతదేహాన్ని టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TVS XL) బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని రామక్కపేట శివారుకు తరలించారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని పూర్తిగా తగలబెట్టారు. విజయ ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు..వీరు చేసిన పనులు అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి..పోలీసుల విచారణలో తేలిన నిజాలు చూసి ఖాకీలే ముక్కున వేలేసుకున్నారు..

ఇవి కూడా చదవండి

ఈ కిల్లర్ తల్లి, కుమారుడు ఇలాంటి హత్య చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మే నెలలోనూ రేఖ అనే మరో మహిళను వీరు ఇదే తరహాలో గొంతు పిసికి చంపేశారు. అనంతరం శవాన్ని అచ్చుమయిపల్లి అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టారు. ఆస్తి గొడవలు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న మహిళలనే ఈ ముఠా టార్గెట్ చేస్తోంది. వారిని నమ్మించి, గొంతు కోసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడమే వీరి ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు..

ఈ ఇద్దరు కిల్లర్స్ ఇంతటితో ఆగలేదు. ఈజీ మనీ కోసం మరో నలుగురు మహిళలను హత్య చేసేందుకు ఇప్పటికే టార్గెట్ లిస్ట్ సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు అరెస్ట్ చేసి,తల్లిని జైల్ కి పంపగా.. కొడుకును జ్యూవెయినల్ హోమ్ కి తరలించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి..
బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి..