AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్డీయే ప్రభుత్వానికి శివసేన గుడ్ బై.. ఇక మహారాష్ట్రలో సేన-ఎన్సీపీ ప్రభుత్వం ?

ప్రధాని మోదీ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగింది. సర్కార్ నుంచి ఈ పార్టీకి చెందిన ఒకే ఒక్క మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సేన తెగదెంపులు చేసుకున్నట్టే.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సేన-బీజేపీ మధ్య పేచీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇసో సరికొత్త పరిణామం. రాష్ట్రంలో మీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్చలే అవసరమనుకుంటే ఎన్డీయే నుంచి బయటికి రావాలని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ […]

ఎన్డీయే ప్రభుత్వానికి శివసేన గుడ్ బై.. ఇక మహారాష్ట్రలో సేన-ఎన్సీపీ ప్రభుత్వం ?
Anil kumar poka
|

Updated on: Nov 12, 2019 | 12:11 PM

Share

ప్రధాని మోదీ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగింది. సర్కార్ నుంచి ఈ పార్టీకి చెందిన ఒకే ఒక్క మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సేన తెగదెంపులు చేసుకున్నట్టే.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సేన-బీజేపీ మధ్య పేచీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇసో సరికొత్త పరిణామం. రాష్ట్రంలో మీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్చలే అవసరమనుకుంటే ఎన్డీయే నుంచి బయటికి రావాలని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ సేనకు షరతు విధించారు. దీంతో ఎలాగైనా రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటుకు తహతహలాడుతున్న సేన.. ఎన్సీపీతో జట్టు కట్టడానికి రెడీ అయింది. అదే సమయంలో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ఆశగా చూస్తోంది. ఏమైనా ఈ తాజా పరిణామాలతో.. రాష్ట్రంలో శివసేన ఆధ్వర్యంలో ఎన్సీపీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిధ్ధమైంది. తమ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ చేరుకోవాలని శివసేన నాయకత్వం వారికి పిలుపునివ్వగా.. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమవుతోంది. బహుశా మహారాష్ట్రలో సేన-ఎన్సీపీ ప్రభుత్వానికి ఈ పార్టీ బయటినుంచి మద్దతునివ్వవచ్చునని భావిస్తున్నారు. కాగా-తమ పార్టీ వైపే సత్యం ఉందని, ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం ‘ తప్పుడు పరిస్థితుల్లో ‘ ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటని సేన నేత అరవింద్ సావంత్ ప్రశ్నించారు. అందువల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన ట్వీట్ చేశారు.

ఎన్డీయే ప్రభుత్వంలో అరవింద్ సావంత్ భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ నిస్సహాయత వ్యక్తం చేయడంతో.. రాష్ట్రంలో మీరు సర్కార్ ని ఏర్పాటు చేయగలుగుతారా.. అసలు ఇందుకు సుముఖంగా ఉన్నారా అని సేనను ప్రశ్నించిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆ పార్టీని ఆహ్వానించారు. సోమవారం సాయంత్రానికల్లా తమ బలం ఎంతో సేన గవర్నర్ ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఈ పార్టీకి ఎన్సీపీ, కాంగ్రెస్ సభ్యుల మద్దతు కూడా అవసరమవుతుంది. సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే ఇవాళ శరద్ పవార్ తో భేటీ కానున్నారు. సీఎం గా ఉధ్దవ్, డిప్యూటీ సీఎం గా ఎన్సీపీ నేత ఉండగలరన్న ఫార్ములా సర్క్యులేట్ అవుతోంది. అటు-మహారాష్ట్రలో సేన ప్రభుత్వానికి మద్దతు నివ్వాలా, వద్దా అన్న విషయమై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించబోతోంది. సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఢిల్లీ వెళ్లి.. సర్కార్ ఏర్పాటుకు తమ పార్టీకి మద్దతునివ్వవలసిందిగా కోరనున్నారు. మరోవైపు-మహారాష్ట్రలో సేన ఆధ్వర్యాన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ పాత్ర ఏమిటన్న దానిపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని ఓ రిసార్టులో సేద దీరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నారు.