దీపావళి బంపర్ ఆఫర్: ఒక్క రూపాయికే షర్ట్, రూ.10లకే నైటీ..!

దీపావళి పండుగకు వ్యాపారులు.. వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. అలాగే.. ఓ వ్యక్తి.. కేవలం పేద వారి కోసం.. ఒక్క రూపాయికే షర్ట్.. రూ.10లకే నైటీ‌ ఆఫర్‌ను ప్రకటించాడు. దీపావళి పండుగ రోజున ప్రతీ పేదవారి కళ్లల్లో ఆనందం నింపేందుకు వారి కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించాడు ఆ షాపు యజమాని. ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకూ.. రోజూ ఓ గంటపాటు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:08 pm, Sun, 27 October 19
దీపావళి బంపర్ ఆఫర్: ఒక్క రూపాయికే షర్ట్, రూ.10లకే నైటీ..!

దీపావళి పండుగకు వ్యాపారులు.. వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. అలాగే.. ఓ వ్యక్తి.. కేవలం పేద వారి కోసం.. ఒక్క రూపాయికే షర్ట్.. రూ.10లకే నైటీ‌ ఆఫర్‌ను ప్రకటించాడు. దీపావళి పండుగ రోజున ప్రతీ పేదవారి కళ్లల్లో ఆనందం నింపేందుకు వారి కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించాడు ఆ షాపు యజమాని. ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకూ.. రోజూ ఓ గంటపాటు ఈ ఆఫర్‌తో బట్టలు విక్రయించాడు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మాత్రమే.. రూపాయికి షర్ట్.. పది రూపాయలకు ఒక నైటీ.

చెన్నైకి చెందిన ఆనంద్ చాకలిపేటలోని తన బట్టల షాపులో దీపావళి పండుగ సందర్భంగా.. పేదవారికి ఓ అద్భుత ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ ఆఫర్ ప్రకటించడంతో.. తెల్లవారు జాము నుంచే.. అతని షాపుకు జనాలు క్యూ కట్టారు. నిజానికి రోజుకు 50 మందికి మాత్రమే.. అతను అమ్మకాలు చేద్దామనుకున్నా.. పేదలు ఎక్కువగా పోటెత్తడంతో ఆ సంఖ్యను 200గా మార్చాడు.

ఈ సందర్భంగా వ్యాపారి ఆనంద్ మాట్లాడుతూ.. పేద ప్రజలు కూడా ఖరీదైన వస్త్రాలు ధరించి దీపావళి జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఈ ఆఫర్ అమలు చేసినట్టు తెలిపారు. ఉచితంగా ఇస్తే దానికి విలువ ఉండదని.. అందుకే 10 రూపాయలకు నైటీ.. రూపాయికే షర్టు విక్రయించినట్టు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఎగబడ్డారని.. దీంతో.. షాప్ ముందు భారీగా జనం బారులు తీరడంతో.. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆనంద్ పేర్కొన్నారు.