అక్కడ డబ్బులను తూకమేసి అమ్ముతారట..!

ఆ దేశంలో డబ్బులను తూకమేసి అమ్ముతారు. అక్కడ డబ్బులు.. గుట్ట గుట్టలుగా దర్శనమిస్తూంటాయి. వీధిలో.. కిరాణా సరుకులు అమ్మినట్టు.. గుట్టలు గుట్టలు వేసి అమ్ముతూంటారు. వీధికో మార్కెట్ ఉంటుంది. కరెన్సీని కిలోల చొప్పున తూకమేసి మరీ అమ్ముతారు. మనదేశంలో.. గతంలో ఉన్నట్టుగా.. ఇప్పుడు ఆ దేశంలో.. వస్తుమార్పిడి విధానం కొనసాగుతోంది. ఎందుకంటే.. అక్కడ వారికి డబ్బుతో పనిలేదు. ఎవరి ఇంట్లో చూసినా.. డబ్బులు కట్టకట్టలు దర్శనమిస్తాయి. ఇంత కరెన్సీ ఉన్నా.. అక్కడి ప్రజలు పేదరికంలో.. మగ్గిపోతున్నారు. నిత్యావసర […]

అక్కడ డబ్బులను తూకమేసి అమ్ముతారట..!
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2019 | 2:14 PM

ఆ దేశంలో డబ్బులను తూకమేసి అమ్ముతారు. అక్కడ డబ్బులు.. గుట్ట గుట్టలుగా దర్శనమిస్తూంటాయి. వీధిలో.. కిరాణా సరుకులు అమ్మినట్టు.. గుట్టలు గుట్టలు వేసి అమ్ముతూంటారు. వీధికో మార్కెట్ ఉంటుంది. కరెన్సీని కిలోల చొప్పున తూకమేసి మరీ అమ్ముతారు. మనదేశంలో.. గతంలో ఉన్నట్టుగా.. ఇప్పుడు ఆ దేశంలో.. వస్తుమార్పిడి విధానం కొనసాగుతోంది. ఎందుకంటే.. అక్కడ వారికి డబ్బుతో పనిలేదు. ఎవరి ఇంట్లో చూసినా.. డబ్బులు కట్టకట్టలు దర్శనమిస్తాయి. ఇంత కరెన్సీ ఉన్నా.. అక్కడి ప్రజలు పేదరికంలో.. మగ్గిపోతున్నారు.

నిత్యావసర సరుకులు కొనాలంటే.. వేలకు వేలు పెట్టాలి. అయినా.. అక్కడి వారు బాధపడరు. మన కరెన్సీ వారికి రూ.650 ఇస్తే.. 50 కిలోల వారి కరెన్సీని ఇస్తారు. అక్కడ ఏటిఎంలు.. బ్యాంకులు ఉండవు. ఇంతకీ ఆదేశం ఏంటా అనుకుంటున్నారా.. ఆఫ్రికా ఖండంలోని సోమాలియాల్యాండ్. ఇంతకీ ఈ దేశం ఇలా అవడానికి కారణాలేంటి..? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోంది.

సోమాలియాల్యాండ్ దేశం ఇలా కావడానికి వేల ఏండ్ల చరిత్ర ఉంది. అలాగే.. గతంలో కొందరు అధికారులు తీసుకున్న నిర్ణయాల కారణంగా.. ఇక్కడి ప్రజలు దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ దేశ కరెన్సీ షిల్లింగ్స్. సోమాలియా ల్యాండ్ ఇదివరకు సోమాలియా దేశంలో కలిసి ఉండేది. 1991లో యుద్ధం తర్వాత ఇది సోమాలియా దేశం నుంచి విడిపోయింది. అప్పటికే ఆదేశంలో.. పేదలు ఎక్కువగా ఉన్నారు. వీరిని ధనవంతులుగా మార్చాలన్న నాయకుల ఆలోచన మేరకు.. విచ్చలవిడిగా కరెన్సీని ప్రింట్ చేయించి.. ఇంటింటికి పంచిపెట్టారు. దీంతో.. ఆదేశంలోని ప్రజలు బద్ధకస్తులుగా మారి.. పనుల ఊసే మరిచారు. అంతేకాకుండా.. పన్నులు కూడా కట్టకుండా ఉండిపోయారు. దీంతో.. ఈ కరెన్సీ విదేశీ అప్పులు తీర్చడానికి కూడా పనికి రాకుండా పోయింది. కొన్ని దేశాలు ఈ కరెన్సీని బ్యాన్ చేశాయి.

దీంతో.. నగదు లేక.. ఇక్కడి ప్రజలు.. వస్తుమార్పిడి విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ దేశంలో.. ఎక్కువగా బాస్మతి రైస్ ఎక్కువగా పండుతాయి. అలాగే.. ఇక్కడ దారి దోపిడీలు.. క్రైం రేటు ఎక్కువ. అందుకే ఇతర దేశాలు కూడా.. దీన్ని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఈ దేశంలో.. ఏటీఎంలు, బ్యాంకులు లేవు. పాలన వ్యవస్థ కూడా.. సరిగా లేదు.