AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో

అర్ధరాత్రి విజయవాడ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్ నుంచి యువతికి అత్యాచార యత్నం జరిగింది. ఆమె శక్తి యాప్‌ను ఉపయోగించి పోలీసులకు సమాచారం చేరవేయగా, మంగళగిరి పోలీసులు తక్షణమే స్పందించారు. శక్తి యాప్ ట్రాకింగ్‌తో నిందితుడిని అరెస్ట్ చేసి, యువతికి భద్రత కల్పించారు. మహిళా భద్రతకు ఈ యాప్ ఎంతగానో తోడ్పడుతుందని ఈ ఘటన నిరూపించింది.

Vijayawada: అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
Mangalagiri Police Use Shakti App to Rescue Woman
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 26, 2026 | 12:14 PM

Share

బెంగళూరులో ఆ యువతి జాబ్ చేస్తుంది. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ బస్తాండ్ కు చేరుకుంది. అక్కడ నుండి నంబూరు వెళ్లేందుకు వేచి చూస్తుంది. ఆ సమయంలో ఇంటికి వెళ్లడం సబబు కాదనుకుని బస్టాండ్ లో వెయిట్ చేసింది. అదే సమయంలో మొబైల్‌లో శక్తి యాప్ డౌన్ లోడ్ చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. నంబూరు వరకూ వెళతానని చెప్పాడు. అయితే ఆటోలో వెళ్లేందుకు ఆమె మొదట నిరాకరించింది. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆటో డ్రైవర్ అడగడంతో సరే వెళ్దామని చెప్పింది.

ఆటో ఎక్కేముందే నంబర్ ఫోటో తీసుకొని శక్తి యాప్‌లో అప్‌లోడ్ చేసింది. విజయవాడ నుండి డిజిపి కార్యాలయం వరకూ వచ్చే సరికి ఆటో డ్రైవర్ ఫణీంద్ర ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అప్పటి నుండి ఆమె అన్ని వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేసింది. ఫోన్ కాల్స్ వస్తుండటంతో అనుమానించి ఆటో డ్రైవర్ ఎవరూ ఫోన్ చేస్తున్నారని అడిగాడు. ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తున్నారని చెప్పడంతో.. కాజా టోల్ ప్లాజా వరకూ ఆటో పోనిచ్చాడు. అప్పటికే అతని మాటలతో ఇబ్బంది పడిన యువతి కొద్ది దూరం పోగానే నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. యాప్‌లో ఆటోను ట్రాక్ చేసిన మంగళగిరి ఎస్సై వెంకట్ టోల్ గేట్ కొద్దీ దూరంలో ఆటోను గుర్తించి మహిళను రక్షించారు. ఫణీంద్రను అదుపులోకి తీసుకున్నారు.

శక్తి యాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంతోనే మహిళను పోలీసులు రక్షించగలిగారు. ఆటో డ్రైవర్ కొలను కొండకు చెందిన ఫణీంద్ర గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వ్యవహరశైలిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శక్తి యాప్ మహిళల భద్రతకు సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇంటి నుండి బయటకు ఒంటరిగా వెళ్లే మహిళలు యాప్ ను తమ మొబైల్స్ లో డౌన్‌లోడ్ చేసుకోవాలని మంగళగిరి డిఎస్పీ మురళి క్రిష్ణ సూచించారు.

అయితే.. శక్తి యాప్ ద్వారా.. ఆటో డ్రైవర్ బారి నుంచి యువతిని కాపాడిన మంగళగిరి రూరల్ పోలీసులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. మహిళల భద్రతకు టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో ఈ ఘటన నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us