బాగ్‌లింగంపల్లిలో గోడ కూలి చిన్నారి మృతి
హైదరాబాద్ మహానగరంలోని విషాదం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్నే వర్షాలకు బాగ్‌లింగంపల్లిలో గోడ కూలి చిన్నారి దుర్మరణం పాలవ్వగా, మరొకరికి గాయపడ్డారు.
హైదరాబాద్ మహానగరంలోని విషాదం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్నే వర్షాలకు బాగ్‌లింగంపల్లిలో గోడ కూలి చిన్నారి దుర్మరణం పాలవ్వగా, మరొకరికి గాయపడ్డారు. సంజయ్‌నగర్‌లో ప్రమాదవశాత్తు ఓ గోడ కూలి అక్కడే ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సంజయ్‌నగర్‌లో నివాసముంటున్న జయకృష్ణ అనే వ్యక్తి నూతనంగా ఇంటిని నిర్మించుకునేందుకు.. పాత ఇల్లును కూల్చివేస్తున్నాడు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇల్లు కూల్చివేత పనులను నిలిపివేశాడు.
ఇదే క్రమంలో ఇంటి ముందున్న ఇటుకలను తీసివేస్తుండగా.. ప్రమాదవశాత్తు గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో జయకృష్ణ కూతురు జయశ్రీ(7) ప్రాణాలు కోల్పోగా, ఆయన తల్లి విజయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం విద్యానగర్‌లోని ఆంధ్రా మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.