మృతులకు పరిహారం ప్రకటించిన సీరమ్ సంస్థ.. ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని..

Serum Institute Fire: పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియాలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఐదుగురు కార్మికులకు....

  • Ravi Kiran
  • Publish Date - 9:23 pm, Thu, 21 January 21
మృతులకు పరిహారం ప్రకటించిన సీరమ్ సంస్థ.. ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని..

Serum Institute Fire: పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఇండియాలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఐదుగురు కార్మికులకు సంస్థ సీఈవో పరిహారాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

”ఈ రోజు సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌లో మనందరికీ చాలా బాధాకరమైన రోజు. ఇవాళ సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలిజేస్తున్నాం. అంతేకాకుండా ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని అందిస్తున్నాం” అని సీరమ్ సీఈవో పూనావాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అటు ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ”సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఎంతో బాధకు గురి చేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అలాగే మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను” అని కోవింద్ ట్వీట్ చేశారు.

కాగా, మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.