నోయిడా లోని ఆసుపత్రికి బాంబు బెదిరింపు, డాగ్ స్క్వాడ్ తో పోలీసుల సెర్చ్, బూటకపు కాల్ గా అనుమానం,

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో గల కైలాష్ ఆసుపత్రిలో గురువారం బాంబు పెట్టారన్న కాల్ కలకలం సృష్టించింది.

  • Umakanth Rao
  • Publish Date - 9:45 pm, Thu, 21 January 21
నోయిడా లోని ఆసుపత్రికి బాంబు బెదిరింపు, డాగ్ స్క్వాడ్ తో పోలీసుల సెర్చ్, బూటకపు కాల్ గా అనుమానం,

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో గల కైలాష్ ఆసుపత్రిలో గురువారం బాంబు పెట్టారన్న కాల్ కలకలం సృష్టించింది. అజ్ఞాత వ్యక్తి ఎవరో ఫోన్ చేసి ఈ ఆసుపత్రి బేస్ మెంట్ వద్ద బాంబు ఉందని తెలిపాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం సమాచారంపై అక్కడికి డాగ్ స్క్వాడ్ తో చేరుకున్న పోలీసులు అణువణువూ గాలించారు. అప్పటికే మొదటి అంతస్తులోని స్టాఫ్ ను, రోగులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బహుశా ఇది బూటకపు కాల్ అయి ఉండవచ్ఛునని అనుమానిస్తున్నా ఎందుకైనా మంచిదని సెర్చ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. గతంలో కూడా ఈ ఆసుపత్రికి బాంబు బెదిరింపు కాల్ అందింది.